హైదరాబాద్ : తెలంగాణ భవన్ వేదికగా బీడీఎల్ నాయకులతో జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమైన పబ్లిక్ సెక్టార్ కంపెనీల పునరుద్ధరణలో కేసీఆర్ పాత్రను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు కేంద్రంలోని బీజేపీ పాలనలో పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులపై విమర్శలు చేశారు.
“ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిలో కుంగిపోకూడదు, గెలుపులో పొంగిపోకూడదు అని కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేధావులు, నిపుణులతో కలిసి మన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రణాళికలు రూపొందించింది. సింగరేణి వంటి సంస్థకు ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు అందించిన ఘనత కేసీఆర్ దే.
తెలంగాణ డిస్కములను ప్రవేట్ కంపెనీలకు దారాదత్తం చేశారు. బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టమంటే ఆ మైన్ మొత్తం ఆదానికి రాసిచ్చారు. కేంద్రంలోని బీజేపీ పాలన పబ్లిక్ సెక్టార్ సంస్థలను ఆదాని వైపు నడిపింది, ఇది బాధాకరం” అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రైతు బీమా పథకం – కేసీఆర్ దృఢ నిర్ణయం
“రైతు కుటుంబాలను ఆర్థిక భద్రత కల్పించే ఐదు లక్షల బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. ఇది దేశంలోనే అత్యుత్తమ పథకంగా నిలిచింది. ఈ బీమాను ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ద్వారా నిర్వహించి, ప్రభుత్వ రంగాన్ని బలపరిచిన ఘనత కూడా కేసీఆర్ గారిదే” అని కేటీఆర్ చెప్పారు. ఎల్ఐసి కంపెనీకి ఇచ్చి ప్రభుత్వ కంపెనీని కాపాడడం ఆనాడు జరిగింది. ఈనాడు ఎల్ఐసి కి అతిపెద్ద కస్టమర్ అంటే తెలంగాణ ప్రభుత్వం.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు
కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను ఎత్తిచూపారు. “కేవలం ఒకే సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ప్రజలు కాంగ్రెస్ పాలనలో నిరాశకు గురవుతున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. రైతులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, లగచర్ల భూముల రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే, వారిపై అణచివేత చర్యలు తీసుకోవడం దారుణమైంది” అని కేటీఆర్ విమర్శించారు.
Also Read-
సామాన్య ప్రజల హక్కులను హరిస్తున్న కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ భవన్‌ను ప్రజాసమస్యల పరిష్కార కేంద్రంగా జనతా గ్యారేజ్ గా మార్చినట్లు ప్రజలు తమ సమస్యల పరిష్కారానికై తెలంగాణ భవానికి రావాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ కార్మిక విభాగం – కొత్త దిశలో
జనవరి మొదటి వారంలో కార్మికుల కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించి, బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి సహకరించే విధంగా కార్యాచరణ రూపొందించి ఒక క్యాలెండర్ ఓపెన్ చేయాలని కోరడం జరిగింది.
బీఆర్‌ఎస్ విజయ లక్ష్యం – కేసీఆర్ దార్శనికత
కేటీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మన విజయం కోసం మార్గదర్శకంగా ఉంటాయి. ప్రజల మద్దతుతో బీఆర్‌ఎస్ విజయ పథంలో ముందుకు సాగుతుందని నమ్మకం ఉంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, వాణి దేవి, నవీన్ కుమార్ రెడ్డి, శంబిపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పోరాటపటిమకు, కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు అండగా ఉంటారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.