అమెరికా పిచ్చి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖోమెనీని హత్య చేశారు, ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిస్సైళ్లతో దాడులు

గమనిక: ప్రపంచంలోనే అత్యంత పిచ్చి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖోమెనీని హత్య చేశారు. ఖోమెనీ హత్య అమెరికా విధానం. తనకు తలొగ్గడానికి నిరాకరించే ఏ దేశాన్నైనా నాశనం చేయడమేనని మరోసారి నిరూపించింది. ఈ క్రమంలో, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను ఉరితీశారు. తదనంతరం, లిబియా నాయకుడు కల్నల్ గడాఫీని ఉరితీశారు. ప్రస్తుతం, అమెరికా వివిధ సుంకాలను విధిస్తూ మొత్తం ప్రపంచాన్ని వేధిస్తోంది. తనను పొగిడే దేశాలపై అది ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అమెరికా ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై దాడి చేస్తూనే ఉంటే, మనం ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం? కాబట్టి, అమెరికాకు గుణపాఠం నేర్పడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు ఐక్యం కావాలి. లేకుంటే, ఒక రోజు మనమందరం చనిపోవడం ఖాయం.

హైదరాబాద్ : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హంతమొందించాలని ఎన్నో ఏళ్లుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా పై చేయి సాధించాయి. తాజాగా ఇరాన్‍పై సంయుక్తంగా నిర్వహించిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఓ వైపు తమతో ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్‍పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తునే మరో వైపు ఉన్నట్టుండి విరుచుకుపడటం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. నెలల పాటు ఖమేనీ కదలికలపై సీఐఏ, మొసాద్ సేకరించిన పక్కా సమాచారంతో ఖమేనీని చంపినట్లు తెలుస్తోంది.

నిఘా సంస్థలు సేకరించిన సమాచారంతో పాటు టెహ్రాన్‍లోని ఆఫీసులో ఖమేనీ ఉన్నట్లు యూఎస్, ఇజ్రాయెల్ నిర్థారణకు వచ్చాయి. శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేశన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా దాడులకు దిగితే ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిస్సైళ్లతో దాడులు జరిపినట్లు తెలిసింది.

Also Read-

శనివారం అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ లయన్ రోర్’ పేరుతో జరిపిన దాడులు ఇరాన్ మిలటరీ స్థావరాలు మరియు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయనేట్లు పైకి కనిపించాయి. కానీ ‘ఆపరేషన్ కిల్ ఖమేని’ పేరుతో శనివారం తెల్లవారుజామున 1:15 గంటలకు ఇరాన్‍పై మిస్సైల్స్ తో రెండు దేశాలు ఏకకాలంలో ఎటాక్ చేసినట్లు తాజాగా తెలుస్తోంది.

ఈ దాడి కోసం కొన్ని నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల ముందే డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు. కూలిన భవనంలో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ టార్గెట్‍గా జరిగిన తాజా ఆపరేషన్‍కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతుగా నిలిచాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X