हैदराबाद : तेलंगाना विधानसभा चुनाव में सत्ता में आई कांग्रेस को संसद चुनाव में भी वही परिणाम दोहराने की उम्मीद है। उसी के अनुरूप कदम उठाए जा रहे हैं। न केवल मजबूत उम्मीदवारों को मैदान में उतारना है बल्कि जीत के लिए अपनाई जाने वाली रणनीतियों को भी धार दे रही है। सीएम रेवंत रेड्डी ने बुधवार को भुवनगिरी लोकसभा क्षेत्र चुनाव समीक्षा बैठक में शामिल हुए नेताओं को दिशानिर्देश दिया। इस मौके पर उन्होंने एक अहम घोषणा की। यह घोषणा की गई है कि एपी में सीएम जगन द्वारा लागू की गई स्वयंसेवी प्रणाली की तर्ज पर तेलंगाना में भी एक नई प्रणाली शुरू की जाएगी।
पता चला है कि सीएम रेवंत रेड्डी ने घोषणा की है कि तेलंगाना में जल्द ही इंदिराम्मा समितियां गठइत की जाएगी। तेलंगाना में छह गारंटी के नाम पर कई योजनाएं चलाई जा रही हैं। इस पृष्ठभूमि में उन योजनाओं को लोगों तक पहुंचाने के लिए इंदिराम्मा समितियों का गठन किया जाएगा। इस संसदीय चुनाव में प्रत्येक मतदान केंद्र पर अच्छा काम करने वाले कार्यकर्ताओं की पहचान कर उन्हें इंदिरम्मा समितियों में नियुक्त किया जाएगा। खबर है कि सरकार की ओर उन्हें 6 हजार रुपये की सम्मान राशि भी देने की सीएम ने घोषणा की है।
आंध्र प्रदेश में इस समय फील्ड स्तर पर स्वयंसेवी प्रणाली लागू की जा रही है। जबकि एपी सरकार नवरत्न के नाम पर विभिन्न योजनाएं पेश कर रही है। स्कूल जाने वाले छात्रों से लेकर वरिष्ठ नागरिकों तक कई लोग इन योजनाओं से लाभान्वित हो रहे हैं। सरकार द्वारा लागू योजनाओं का लाभ सभी पात्र लाभार्थियों के दरवाजे तक पहुंचाने के लिए एक स्वयंसेवी प्रणाली लाई गई है। ग्राम स्वयंसेवी प्रणाली का मूल उद्देश्य लोगों के दरवाजे पर शासन सेवाएं प्रदान करना है। स्वयंसेवक गांवों में लोगों को पेंशन से लेकर राशन का सामान तक उपलब्ध कराते हैं।
प्रत्येक स्वयंसेवक को 50 परिवारों को कवर करना होता है जबकि उन्हें राज्य सरकार से प्रति माह 5000 रुपये का मानदेय मिलता है। मालूम हो कि टीडीपी प्रमुख चंद्रबाबू ने हाल ही में घोषणा की थी कि अगर वे सत्ता में आए तो स्वयंसेवकों को 10,000 रुपये मानदेय राशि देंगे. लेकिन हमें इंतजार करना होगा और देखना होगा कि आंध्र प्रदेश में सफल यह प्रणाली तेलंगाना में किस हद तक सफल होगी।
తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఎత్తుగడులు వేస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించటమే కాకుండా గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బుధవారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష సమావేశానికి హాజరైన సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న వాలంటీర్ల విధానం తరహాలో తెలంగాణలోనూ ఓ కొత్త వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ కమిటీలను తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటంచినట్లు తెలిసింది. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణలో అనేక పథకాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి రూ. 6 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించినట్లు సమాచారం.
ఏపీలో ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో వాలంటీర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ఎన్నో రకాల పథకాలు అందిస్తుండగా స్కూలుకు వెళ్లే విద్యార్థుల దగ్గరి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా మంది ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేసేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజల ఇంటి వద్దకే పాలనా సేవలను అందించడం అనేది గ్రామ వాలంటీర్ వ్యవస్థ అసలు లక్ష్యం. పెన్షన్ల నుంచి రేషన్ సరుకుల వరకు వాలంటీర్లు గ్రామాల్లో ప్రజలకు అందజేస్తారు.
ఒక్కో వాలంటీర్ 50 కుటుంబాలను కవర్ చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి నెలకు 5000 గౌరవ వేతన లభిస్తుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10 వేల గౌరవ వేతనం ఇస్తామని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో సక్సె్స్ అయిన ఈ వ్యవస్థ తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి మరి. (ఏజెన్సీలు)