‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. మన జాతీయ వీరులందరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మన తెలుగు తెగువ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ.. ముగింపు ఉత్సవాలకు గౌరవ రాష్ట్రపతి గారు హాజరయ్యారు.

గతేడాది 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ విమోచన ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఆగస్టు 13 నుంచి 15 నుంచి వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుపుకున్నాం. అదే స్ఫూర్తితో.. అందరినీ మరోసారి ఏకతాటిపైకి తెచ్చేందుకు.. ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమం‘నేను పుట్టిన నేల, నన్ను కన్న దేశం’ పేరుతో సెప్టెంబర్ 1 న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

‘మన మట్టికి నమస్సులు, మన వీరులకు వందనం’ నినాదంతో మన మట్టికోసం పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధులు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ శాంతిభద్రతల సంరక్షణలో అమరులైన వారందరినీ స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామంలోని యువకులు, మహిళలు, పెద్దలు, అందరూ కలిసి దేశం కోసం త్యాగాలు చేసిన సమరయయోధులు, భద్రతా సిబ్బందిని గుర్తుచేసుకోవాలి. ప్రతి ఇంటినుంచి పిడికెడు మట్టి కానీ.. పిడికెడు బియ్యాన్ని కానీ కలశంలో సేకరించాలి.

అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సెప్టెంబర్ నెలలో అన్ని గ్రామాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరిస్తాం. ఆ తర్వాత దీన్ని మండల కేంద్రాలకు చేర్చి.. అక్కడ దీన్ని గౌరవించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత జిల్లా కేంద్రం.. అక్కడినుంచి రాష్ట్ర రాజధానికి చేర్చి అక్కడ కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి.. చివరకు ఢిల్లీలో కర్తవ్యపథ్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించకుంటాం.

అమృత్ పార్క్ (అమృత వనం) 75వేల మొక్కలు నాటి సుమారు 7500 కలశాల ద్వారా వచ్చిన మట్టిని.. కర్తవ్యపథ్ లో వార్ మెమోరియల్ పక్కనున్న స్థలంలో పెట్టి.. అమరవీరుల స్మారకంగా అమృత వనాన్ని ఏర్పాటుచేస్తాం. దీంతోపాటుగా అమృత స్థూపాన్ని కూడా ఏర్పాటుచేయనున్నాం.

భరతభూమిలో మనం జన్మించడమే మన అదృష్టం.. కాబట్టి ఈ పవిత్రకార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం అక్టోబర్ 31, సర్దార్ వల్లభాయ్ పటేల్, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా.. ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. దేశంలోని అన్ని గ్రామాల్లో.. అన్ని సామాజిక వర్గాల ప్రముఖులు, విద్యార్థులు యువతను భాగస్వాములు చేయాలని నిర్ణయించాం.

ఐదు అంశాల మీద ప్రతిజ్ఞ చేయించే కార్యక్రమం ఉంటుంది. వలసవాద ఆలోచనలనుంచి విముక్తి భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించి పరిరక్షిస్తామం దేశ ఐకమత్యం, సార్వభౌమత్వం కోసం ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుతాం.

2047 నాటికి దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో 140 కోట్ల మంది ప్రజలు.. రాజకీయాలకు అతీతంగా.. సిద్ధాంతాలను, కుల, మతాలను, పక్కనపెట్టి అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయడంలో.. మనవంతు పాత్రను పోషిస్తామని.. మేరీమాటీ మేరా దేశ్ అని దేశ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇది దేశానికి సంబంధించిన కార్యక్రమం. దేశ ప్రజలందరూ పాల్గొనాల్సిన కార్యక్రమం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ముగింపు సందర్భంగా జరుగుతున్న కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలి. అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను.

సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను గతేడాది నిర్వహించాం. ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. గత ప్రభుత్వాలు విమోచనదినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని విస్మరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X