तेलंगाना में दो दिन भारी बारिश, इन जिलों के लिए ऑरेंज अलर्ट जारी

हैदराबाद : हैदराबाद मौसम विज्ञान केंद्र ने कहा है कि तेलंगाना में अगले दो दिनों तक भारी बारिश होने की संभावना है। मौसम विभाग ने कहा गया है कि मंगलवार तक कई जिलों में हल्की से मध्यम बारिश होने की संभावना है।

आदिलाबाद, कुमरामभीम आसिफाबाद, रंगारेड्डी, मेडचल मलकजगिरी, विकाराबाद, संगारेड्डी, मेदक और कामारेड्डी जिलों में 50 किमी प्रति घंटे की रफ्तार से हवा चलने, बिजली गिरने और ओलावृष्टि होने की संभावना है। इसके अलावा तेलंगाना के बाकी जिलों में तेज हवाओं के साथ भारी बारिश होगी।

मंगलवार से बुधवार तक आदिलाबाद जिले के साथ निजामाबाद, विकाराबाद, संगारेड्डी, मेदक, कामारेड्डी और महबूबनगर जिलों में गरज, बिजली और ओलावृष्टि के साथ भारी बारिश के संकेत हैं। संबंधित जिलों को ऑरेंज अलर्ट जारी किया गया है।

हालांकि, पश्चिम विदर्भ से मराठवाड़ा, उत्तर आंतरिक कर्नाटक और दक्षिण आंतरिक कर्नाटक में समुद्र तल से 1.5 किमी की ऊंचाई पर द्रोणी अनिश्चितता जारी रहेगी। मौसम विभाग ने बताया कि इसके प्रभाव से बारिश होने की संभावना है।

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం పలుజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగార్డె, మెదక్‌, కామారెరడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో పాటు గంటకు 50కిలోమీటర్ల వరకు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో భారీ వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మేరకు ఆయా జిల్లాల్లకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

అయితే, పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అనిశ్చితి కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు …

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకుద్రోణి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటూ పొరుగు ఉనన తమిళనాడు, దక్షిణ కర్ణాటక, కేరళలో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయంటున్నారు.

ఏపీలో మరో మూడు రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటూ ఈదురుగాలులు వీస్తాయి అంటున్నారు. విస్తారంగా, అక్కడక్కడా భారీగా వానలు పడతాయంటున్నారు. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆరుబయట పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.

ఏపీలో వర్షాలపై విపత్తుల సంస్థ కూడా అప్రమత్తం చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈ వానలు పడతాయి అంటున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది అంటున్నారు.

మరోవైపు అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. పంట దెబ్బతిని, పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వనాలతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి, మిరప, పసుపు కల్లాల చుట్టూ నీళ్లు చేరడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పంటను కాపాడుకోవడానికి పట్టలు కప్పినా సరే ఈదురు గాలులతో పట్టలు పక్కకు జరిగిన పంటలు తడిచిపోయాయంటున్నారు. అక్కడక్కడా కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. అలాగే రోడ్లపై ఆరబెట్టిన, రాశులుగా పోసిన ధాన్యం కిందకు నీళ్లు చేరాయి.

ఈదురు గాలుల దెబ్బకు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు.. అలాగే మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెప్పడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే ఈ ఈదురు గాలులతో కొన్నిచోట్ల స్తంభాలు నేల కూలాయి.. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు నష్టం జరిగిందంటోంది వ్యవసాయశాఖ. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని. రైతులను ఆదుకుంటామని తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X