ఏ.ఇ ల నుండి సి.ఇల దాకా క్షేత్రస్థాయిలో ఉండాలి
రెవిన్యూ యంత్రాంగంతో నీటిపారుదల సిబ్బంది సమన్వయం చేసుకోవాలి
చెరువు కట్టలు తెగిన చోట మరమ్మతులు తక్షణమే చేపట్టాలి
విపత్తుల సమయంలో నిధుల గురుంచి ఆలోచన చేయకండి
ప్రజా భద్రత లో అప్రమత్తత అవసరం
డిండిలో ఐదు ఫీట్ల మేర చేరిన నీరు
రైల్వే ఎఫెక్టెడ్ ఏరియా చెరువుల డ్యామేజ్ లను గుర్తించండి
నీటిపారుదల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తున్న నేపద్యంలో ఏ. ఇ ల నుండి సి.ఇ ల దాక క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చెయ్యాలని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పైగా భారత వాతావరణ శాఖా తెలంగాణా లో రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన దరిమిలా నీటిపారుదల శాఖా సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో సంభవిస్తున్న భారీ వర్షాల నేపద్యంలో నీటిపారుదల శాఖాధికారులతో ఈ ఉదయం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా,సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,ఇ. ఎన్. సి లు అనిల్ కుమార్,నాగేందర్ రావు, హరేరాం,శంకర్ డిప్యూటీ ఇ. యన్. సి శ్రీనివాస్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సి .ఇ లు,యస్.ఇ లు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Also Read-
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చెరువుల డ్యామేజీ లను ఎప్పటికప్పుడు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. విపత్తుల సమయంలో నిధుల గురుంచి ఆలోచన చేయవద్దన్నారు.ప్రజాభద్రత లో అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వారిగా ఆయన సి.ఇ లు., యస్. ఇ లతో మాట్లాడుతూ ఆయా జిల్లాల పరిస్థితులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే డిండి ప్రాజెక్ట్ లో ఆరు ఫీట్ల మేర నీరు చేరిందని ఆ జిల్లా సి.ఇ అజయ్ కుమార్ మంత్రి దృష్టికి తీసుక రాగ ఉదయసముద్రం నిండెలా ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ సూచించారు.
నాగార్జున సాగర్ కు ఇన్ ఫ్లో ఐదు లక్షల క్యూసెక్కులు వస్తుండగా ఔట్ ఫ్లో 4.70 లక్షల క్యూసెక్కులు గా ఉందని ఆయాన మంత్రి దృష్టికి తెచ్చారు. సాగర్ నుండి పాలేరు రిజర్వాయర్ కు నీటిని నిలిపి వేశారు.అయితే అప్పటికే వర్షపు నీటితో పాలేరు రిజర్వాయర్ నిండి పోవడంతో చేరిన బ్యాక్ వాటర్ తో 132 కిలో మీటర్ల వద్ద,133.06 కిలో మీటర్ల వద్ద గండి పడినట్లు అధికారులు మంత్రి ఉత్తమ్ దృష్టి కి తీసుకోచ్చారు.
అదేవిధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ కు సాగర్ నుండి వస్తున్న నీటిని నిలిపి వేసినప్పుటికీ కేవలము వరద నీరే 3,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అయితే ప్రస్తుతం వర్షం నిలిచి పోవడంతో పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి,చింతలపాలెం,హుజుర్నగర్ మండలాల్లో తాజా వర్షాలకు దెబ్బతిన్న చెరువుల మరమ్ముతులు వెంటనే చేపట్టాలని సూర్యాపేట జిల్లా సి.ఇ రమేష్ బాబును ఆయన ఆదేశించారు. వరంగల్ జిల్లా కే సముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ ను ఆనుకుని ఉన్న చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి వివరించగా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చెప్పారు.
అంతే గాకుండా రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చెరువులను ,కెనాల్ లను,స్పిల్ వే లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. డ్యామ్ లు,కెనాల్ లు కట్టల పై ఆసాంతం దృష్టి సారించి ప్రమాదకర సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు. కాగా సూర్యాపేట జిల్లాలో వర్ష ఉధృతి కారణంగా దెబ్బతిన్న కోదాడ,హుజుర్నగర్ లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు పర్యటించ నున్నారు.
ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లతో కలిసి లోయర్ మా డ్యాం ను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,ఇతర అధికారులు
మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో భారీ వర్షాలు కూరు స్తున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. అధికారులు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. గత కొంత కాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన పడుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు , చెరువులు, కుంటలు నిండుతున్నాయి. మరో రెండు రోజులు పాటు వర్షాలు ఉన్నాయి.
జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించెంత ఇళ్లలో నుండి ప్రజలను ఖాళీ చేసే పరిస్థితి ఎక్కడ లేదు. ప్రాణ నష్టం ఎక్కడ లేదు. కోహడ్ – ముల్కనూరు ఇళ్ళంతకుంట మండలంలో తదితర ప్రాంతాల్లో రోడ్ల మీద నుండి వరద పోవడం వల్ల రవాణా అగిపోయింది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో మొదలైంది.. ఎల్ఎండి లో 24 టీఎంసీ లకు ప్రస్తుతం 14 టిఎంసి ల ఉన్నాయి. మిడ్ మానేరు కు మోయ తుమ్మెద వాగు , మూల వాగు నుండి వరద వస్తుంది. ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదల జరుగుతుంది. మిడ్ మానేరు ,లోయర్ మానేరు , రంగ నాయక సాగర్ ,మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్ట్ లో నింపుకునే విధంగా వర్షాలు పడ్డాయి..అటు కిందికి కోదాడ వరకు నీళ్ళు అందించవచ్చు.
కరీంనగర్ తో పాటు ఇతర మున్సిపాలిటీ లలో ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్లల్లోకి వచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు..అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర క్లియర్ చేస్తున్నారు. అందరూ అధికారులు క్షేత్ర స్థాయిలో వారు కేంద్రాల్లో నిరంతరం పని చేస్తున్నారు. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా అక్కడ అధికారులతో మాట్లాడను ఎక్కడ ఇబ్బంధి లేదు. హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు లలో లెవెల్స్ నిండే పరిస్థితి ఉంది.
కాళేశ్వరం లో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతుంది. ఎల్లంపల్లి నుండి ప్రతి చుక్క ఉపయోగించుకునే విధంగా ప్రాజెక్ట్ లలో పంపిస్తాం. శ్రీరామ్ సాగర్ లో ప్రస్తుతం 64 టిఎంసి ల ఉన్నాయి..పూర్తి స్థాయి నిండగానే వరద కాలువ ద్వారా నీళ్ళు విడుదల జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో తమ్మడి హట్టి నుండి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు నీళ్లు తీసుకొచ్చేది. ఆ నీరు మిడ్ మానేరు ,రంగ నాయక సాగర్,మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ లకు తీసుకుపోయేది.ఇప్పుడు నీరు కిందికి వృథాగా పోతున్నాయి.
రాబోయే కాలంలో వ్యవసాయం ఇబ్బందులు ఉండవు..ప్రతిపక్షాలు వ్యవసాయానికి ఇబ్బందులు ఉండడద్దని కోరుకోవాలి. వర్షాలు ,ప్రాజెక్టు లు ,వ్యవసాయం పేరు మీద రాజకీయాలు చేయద్దు. ముఖ్యమంత్రి గారు సీఎస్ గారికి ఆదేశించారు.. సిఎస్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ లాంటి వర్షాలు ఎక్కువగా ప్రాంతాల్లో స్కూల్ లకు సెలవులు ఇచ్చారు. హైదరాబాద్ లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు ,ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి. రోడ్ల పై వరద వెళ్తుంటే ద్విచక్ర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వకూడదు. సిద్దిపేట – హనుమకొండ దారిలో కూడా వరద పోతుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు సహకరించాలి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మున్నేరు వాగు వరద ఉధృతి వల్ల ఖమ్మం నగరం.. ప్రకాష్ నగర్ లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ను పంపించాలని సిఎస్ కు ఫోన్ చేసి మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క