मेडारम महाजातरा का ऐसे हुआ समापन, इस बार यह रहा है खास

हैदराबाद: चार दिवसीय मेडारम महाजातरा शनिवार को सम्मक्का और सारलम्मा के वन में प्रवेश करने के साथ समाप्त हो गया। वन प्रवेश क्षण को देखने के लिए भक्तों की भीड़ उमड़ पड़ी थी। चारों ओर भक्तों की भीड़ पाई गई। करीब डेढ़ करोड़ श्रद्धालुओं ने सम्मक्का और सारलम्मा के दर्शन किए और मन्नते पूरी की। मेडारम महाजातरा के चार दिनों के दौरान और पिछले पंद्रह दिनों में भी लाखों श्रद्धालुओं ने मेडारम महाजातरा आये हैं। दो साल में फिर से दर्शन देने के लिए आने का आश्वासन के साथ सम्मक्का चिलुकलगुट्टा और सारलम्मा कन्नेपल्ली चले गये। वन देवताओं के साथ पगिडिद्दराजू और गोविंदराजू अपने युद्ध भूमि के लिए रवाना हो गये।

करीब 1.40 करोड़ श्रद्धालु

भक्तगण दिव्यता से परिपूर्ण हृदय से अपने-अपने घर के लिए रवाना हो गये। अधिकारियों का अनुमान है कि चार दिवसीय मेले के दौरान करीब 1.40 करोड़ श्रद्धालु आये और मन्नते पूरी की। मेले में लग्जरी टेंट, इको टेंट और ग्रीन होटल जैसी आधुनिक सुविधाओं की व्यवस्था की गई थी। मेले की निगरानी में सीसीटीवी और ड्रोन कैमरे का इस्तेमाल किया गया। विधानसभा अध्यक्ष गड्डम प्रसाद ने शनिवार को वन देवताओं के दर्शन किये।

विशेष पूजा-अर्चना

वन देवताओं को साड़ियां बांधकर पूजा-अर्चना की गई। सम्मक्का-सारलम्मा के वन प्रवेश के तहत शनिवार शाम 5 बजे मेडारम में विशेष पूजा-अर्चना की गई। आदिवासी पुजारी (वड्डेरा) लयबद्ध तरीके से ढोल और तुरही बजाते हुए सिंहासन (गद्दे) के पास पहुंचे। उनके चारों ओर साड़ियाँ बांध दी गई, ताकि कोई वन देवताओं को देख न सके। करीब दो घंटे तक पूजा-अर्चना कार्यक्रम चलता रहा। प्रथम पुजारी सिद्दबोइना मुनेंदर, कोक्केरा कृष्णय्या, चंदा बाबूराव, सिद्धबोइना महेश और सिद्धबोइना लक्ष्मण राव ने कुमकुम भरणी के रूप में सम्मक्का को लेकर सिंहासन से नीचे उतर गये।

संबंधित खबर:

कड़ी सुरक्षा

इसके बाद वे रेस्ट हाउस पहुंचे और नागदेवता (नागुलम्मा) को छुकर वहां से वे तेजी से चिलुकालगुट्टा की ओर चले गये। उसके बाद फण (पडिगे) के रूप में पगिडिद्दराजू को पुजारी पेनका बुच्चिरामय्या और गोविंदराजू को पुजारी दब्बकट्ला गोवर्धन और कुछ अन्य पुजारी लेकर सिंहासन के पास से निकल पड़े। आखिर में सारलम्मा को पुजारी सारय्या, वेंकटेश्वरलु, किरण कुमार, कनकम्मा, भजंग राव और लक्ष्मी बाई कन्नेपल्ली के लिए रवाना हो गये। इस दौरान वन देवताओं को जिस प्रकार से सिंहासन पर बैठाने के लिए कड़ी सुरक्षा की गई थी उसी तरह की कड़ी सुरक्षा वन देवताओं को जंगल में ले जाते समय भी पुलिस ने की थी।

श्रद्धालुओं की संख्या में बढ़ोत्तरी

विधायक सीताक्का और जिलाधीश इला त्रिपाठी ने बताया कि इस बार मेडारम महाजातरा के लिए आने वाले श्रद्धालुओं की संख्या में बढ़ोत्तरी हुई है। पिछले साल चार दिनों में एक करोड़ भक्त आये थे। इस बार एक करोड़ 40 लाख भक्त आये हैं। अधिकारियों ने घोषणा की कि शनिवार को भी 20 लाख से अधिक श्रद्धालुओं ने वन देवताओं के दर्शन किये। श्रद्धालुओं की संख्या बढ़ने के बावजूद वन देवताओं के दर्शन कराने में कोई कठिनाई नहीं हुई।

ट्रैफिक जाम

महाजातरा की शुरुआत में जो ट्रैफिक जाम की जो समस्या देखने को मिली थी, वही समस्या श्रद्धालुओं तो अपने घर जाते समय भी हुई हैं। बुधवार से शुक्रवार तक मेडारम में आकर डेरा डालने वाले श्रद्धालुओं को शुक्रवार को घर जाते समय मेडारम-ताड़वाई मार्ग पर यातायात जाम हो गया। सुबह 11 से रात 12 बजे तक श्रद्धालुओं को दिक्कतों का सामना करना पड़ा। करीब चार से पांच घंटे तक श्रद्धालु जाम में फंसे रहे।

‘तिरुगुवारम’ उत्सव

मेडारम महाजातरा समाप्त होने के बाद श्रद्धालु अपने-अपने घरों के निकल पड़े हैं। दो साल बाद फिर महाजातरा का आयोजन होगा। इससे मेडारम इलाका खाली हो गया है। पिछले चार दिनों से तंबू गाड़े और वन देवताओं के पास रहने वाले भक्त और व्यापारी अब घर के लिए रवाना हो गये हैं। सारी दुकानें खाली करके निकल पड़े हैं। धर्मस्व विभाग के अधिकारियों और आदिवासी पुजारियों का कहना है कि अगले बुधवार को होने वाले ‘तिरुगुवारम’ उत्सव तक हर दिन बड़ी संख्या में लोग मेडारम आएंगे और वन देवतों की पूजा-अर्चना करते हैं।

ముగిసిన మేడారం మహాజాతర

హైదరాబాద్: నాలుగురోజుల మేడారం మహాజాతర శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో ముగిసింది. వనప్రవేశం ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎటుచూసినా జనమే కనిపించారు. దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతర నాలుగురోజులతోపాటు అంతకుముందు పదిహేను రోజుల నుంచే ముందస్తు మొక్కులకు కూడా లక్షలాది మంది మేడారానికి వచ్చారు. రెండేండ్లకు మళ్లా వస్తామంటూ భక్తులకు దీవెనార్తులు ఇస్తూ చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ వెళ్లిపోయారు. వారి వెంటే పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ యుద్ధ స్థానాలకు బయలుదేరారు.

గుండెలనిండా నింపుకున్న దైవత్వంతో భక్తులు ఇంటి బాటపట్టారు. నాలుగు రోజుల జాతరలో 1.40 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేశారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్‌‌‌‌ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో సీసీ, డ్రోన్‌‌‌‌ కెమెరాలను వినియోగించారు. అసెంబ్లీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ శనివారం వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

చుట్టూ చీరలు అడ్డుగా కట్టి పూజలు చేసి. తల్లుల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. డోలు వాయిద్యాలు, బూరలు లయబద్ధంగా ఊదుతూ గిరిజన పూజారులు (వడ్డెరలు) గద్దెల వద్దకు చేరుకున్నారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అద్దగంట పాటు పూజా కార్యక్రమం కొనసాగించారు. తొలుత పూజారులు సిద్ధబోయిన మునేందర్‌‌‌‌‌‌‌‌, కొక్కెర కృష్ణయ్య, చందా బాబురావు, సిద్ధబోయిన మహేశ్‌‌‌‌‌‌‌‌, సిద్ధబోయిన లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ రావు కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకుని గద్దె దిగారు.

ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలుకలగుట్ట వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును పూజారి పెనక బుచ్చిరామయ్య, గోవిందరాజును పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ మరికొందరు పూజారులు తీసుకొని గద్దెల దగ్గర నుంచి కదిలారు. చివరిగా సారలమ్మను పూజారులు కాక సారయ్య, వెంకటేశ్వర్లు, కిరణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, కనకమ్మ, భజంగరావు, లక్ష్మీ బాయి తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. దేవతలను గద్దెకు చేర్చే క్రమంలో పోలీసులు ఏ విధమైన రక్షణ కల్పించారో అంతే కట్టుదిట్టమైన రక్షణ మధ్య దేవతలను వనానికి సాగనంపారు.

ఈ సారి మేడారం మహాజాతరకు వచ్చిన భక్తుల సంఖ్య పెరిగింది. గతంలో నాలుగు రోజుల జాతరకు కోటి మంది భక్తులు వస్తే ఈ సారి కోటి 40 లక్షల మంది హాజరయ్యారని మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి ప్రకటించారు. శనివారం కూడా 20 లక్షల మందికి పైగా భక్తులు మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లుగా ఆఫీసర్లు ప్రకటించారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ వాళ్లకు అమ్మవార్ల దర్శనం కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్లుగా ఆఫీసర్లు తెలిపారు.

మహాజాతర ప్రారంభంలో కనిపించే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాం సమస్య ఈసారి భక్తులు ఇండ్లకు వెళుతున్నప్పుడు కలిగింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మేడారం వచ్చి విడిది చేసిన భక్తులు శుక్రవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో మేడారం‒తాడ్వాయి రూట్‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాం అయింది. ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా భక్తులు ఇబ్బందులు పడ్డారు. సుమారు నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాంలో ఇరుక్కుపోవాల్సి వచ్చింది.

మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. మళ్లీ రెండేండ్ల తర్వాత మహాజాతర జరగనుంది. దీంతో మేడారం ప్రాంతం ఖాళీ అవుతున్నది. గత నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉన్న భక్తులు, వ్యాపారస్తులు ఇప్పుడు ఇంటి ముఖం పట్టారు. షాపులన్నీ ఖాళీ చేసుకొని వెళ్లిపోతున్నారు. వచ్చే బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగ వరకు ప్రతీ రోజు ఎంతో కొంత మంది మేడారం వచ్చి తల్లులకు మొక్కులు చెల్లిస్తారని దేవాదాయ శాఖ ఆఫీసర్లు, గిరిజన పూజారులు చెప్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X