हैदराबाद में भारी बारिश, तालाबों में तब्दील हो गये निचले इलाके, येलो अलर्ट जारी, स्कूलों को छुट्टी

हैदराबाद: भारी बारिश से महानगर का जनजीवन अस्त व्यस्त हो गया है। सोमवार रात से लगातार हो रही भारी बारिश से मंगलवार सुबह फिर आरंभ हो गई। दिलसुखनगर, कोत्तापेट, सरूरनगर, एलबीनगर, नागोल, अलकापुरी, खैरताबाद, नामपल्ली, बशीरबाग, हिमायतनगर, एबिड्स, कुतबुल्लापुर, बालानगर, गाजुलारामरम, जगदगिरिगुट्टा, बहादुरपल्ली, सुराराम, सुचित्रा, पोचमपल्ली, पेटबशीराबाद और अन्य इलाकों में जीडिमेटला, जुबली हिल्स और बंजारा हिल्स सहित क्षेत्र में भारी बारिश हो रही है।

लगातार हो रही भारी बारिश के कारण शहर की सभी सड़कें तालाब जैसी नजर आ रही हैं। मुख्य मार्गों पर घुटनों तक बारिश का पानी सड़कों पर जमा हो गया है। इससे आवागमन में लोगों को परेशानी हो रही है। इसी क्रम में जीएचएमसी अधिकारियों ने कहा कि लोगों को सतर्क रहना चाहिए क्योंकि निचली कॉलोनियों में पानी भर गया है। यह सलाह दी गई है कि जब तक बहुत जरूरी न हो, बाहर न निकलें। अधिकारियों ने सहायता सेवाओं के लिए 040-21111111, 9000113667 पर कॉल करने की सलाह दी। मौसम विभाग ने बताया कि शहर में अगले दो घंटे तक भारी बारिश होगी। हैदराबाद में येलो अलर्ट जारी किया गया है।

भारी बारिश के कारण घरों से बाहर निकलने की स्थिति नहीं है। शहर की कई कॉलोनियों में घुटनों तक बारिश का पानी जमा हो गया। हैदराबाद मौसम विभाग के अधिकारियों ने बताया कि अगले दो घंटे तक लगातार बारिश की संभावना है। इसके चलते कई लोग सोशल मीडिया प्लेटफॉर्म पर स्कूल-कॉलेजों में छुट्टियां देने की अपील कर रहे हैं। बच्चों के माता-पिता स्कूल प्रशासन को फोन कर गुहार लगा रहे हैं। ऐसे समय में बच्चों को बाहर नहीं भेजा जा सकता है। इसके चलते सरकार ने स्कूलों को छुट्टी घोषित किया है।

Also Read-

హైదరాబాద్‌‌లో జోరు వాన

హైదరాబాద్‌ : జోరు వానకు మహా నగరం తడిసి ముద్దవుతోంది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం మంగళవారం తెల్లవారుజామున మరోసారి ముంచెత్తింది. దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, కూకట్ పల్లి, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్ల, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా ప్రధాన ఏరియాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.

ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి నగర రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో రోడ్లపై మోకాలిలోతు వరకు వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. సహాయ సేవలు కోసం 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని అధికారులు సూచించారు. నగరంలో మరో రెండు గంటల పాటు భారీ వర్షం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

భారీ వర్షంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నగర వ్యాప్తంగా పలు కాలనీల్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచింది. మరో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని ఇటువంటి సమయంలో పిల్లల్ని బయటకు పంపలేమని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినభారీ వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో పిడుగులు పడి ఐదుగురుమృతిచెందారు. పండుగపూట పడిన పిడుగులు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ లో రైల్వే బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల లోతు నీళ్లు నిలవడంతో అందులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. దీంతో పోలీసులు, యువకులు రంగంలోకి దిగి బస్సులోని ప్రయాణికులను కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాను చాలా రోజుల తర్వాత వర్షాలు పలకరించాయి. హైదరాబాద్ సిటీలోనూ సోమవారం వర్షం దంచికొట్టింది.   ట్రాఫిక్ జాంలతో జనం ఇబ్బందులు పడ్డారు. 

పండుగపూట పిడుగుపాటు కారణంగా ఐదు కుటుంబాల్లో విషాదం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఒకరు, వికారాబాద్ జిల్లాల్లో ఒకరు పిడుగులు పడి చనిపోయారు. గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో నల్లారెడ్డి(35) అనే రైతు, మల్దకల్ మండల కేంద్రంలో ఆదిలక్ష్మి(15) అనే బాలిక, అలంపూర్ నియోజకవర్గం క్యాతూర్ గ్రామంలో వేముల రాజు(40) అనే రైతు పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయారు. గద్వాల మండలం ఉరువపల్లి గ్రామంలో పిడుగుపాటుకు  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అలంపూర్ నియోజకవర్గం కంచుపాడు గ్రామంలో పిడుగు పడి ఓ ఎద్దు చనిపోయింది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం బిట్టూరుపల్లికి చెందిన రైతు జక్కుల భాస్కర్ గౌడ్( 57) పిడుగుపాటుకు మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగిరెడ్డిపల్లికి చెందిన కార్తీక్(14) సోమవారం పశువులను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. సాయంత్రం  పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో కార్తీక్ అక్కడికక్కడే చనిపోయాడు. 

వరద నీటిలో ఆగిన బస్సు 

నిజామాబాద్​సిటీలోని కంఠేశ్వర్ రైల్వే అండర్​బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల వరకు నీరు చేరగా నీళ్లలో ఆర్టీసి బస్సు ఆగిపోయింది.  బస్సులో చిక్కుకుపోయిన మహిళలు, పిల్లలు సహా 22 మంది ప్రయాణికులను పోలీసులు, యువకులు కలిసి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తర్వాత బస్సును జేసీబీ సహాయంతో బయటకు తీసి డిపోకు తరలించారు. పట్టణంలో 83.5 మిల్లీమీటర్ల భారీ వర్షం కురవడంతో చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసింది. వేములవాడ రూరల్‌‌ మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లల్లోకి నీళ్లు చేరాయి. గద్వాల జిల్లా గట్టు మండలం బోయలగూడెం వద్ద వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు ఆగిపోయాయి.  

యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా రోజుల తర్వాత పలుచోట్ల వర్షం కురిసింది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా జిల్లాలో చెప్పుకోదగ్గ వానలు పడలేదు. ఈ సీజన్​లో ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో భారీగా వాన పడుతుందని ఆశించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. యాదగిరిగుట్టలో 88.3 మిల్లీమీటర్ల వాన పడింది. సంస్థాన్ నారాయణపురంలో 60, ఆలేరులో 69 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మోత్కూరులో 1.3 మిల్లీ మీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X