हैदराबाद : शहर में भारी बारिश हुई है। सुबह पांच बजे से बारिश हुई है। नतीजतन बारिश का पानी सड़कों पर जगह-जगह बह रहा है। भारी बारिश के कारण वाहन चालकों को भारी परेशानी का सामना करना पड़ रहा है। मौसम विभाग ने हैदराबाद में अगले 3-4 घंटे भारी बारिश की चेतावनी जारी की है।
हैदराबाद के बशीरबाग इलाके में बारिश का पानी सड़कों पर बह रहा है। इससे वाहन चालकों को भारी परेशानी का सामना करना पड़ रहा है। हिमायत नगर की गली नंबर 14 जलमग्न हुआ है। कुतबुल्लापुर के आसपास के इलाकों में झमाझम बारिश हो रही है। बोडुप्पल, पीरजादीगुडा क्षेत्र भी बारिश से प्रभावित हुए हैं।
सिकंदराबाद और छावनी के आसपास के इलाकों में रुक-रुक कर बारिश हो रही है। चंदाननगर, मियापुर, माधापुर, गच्चीबौली इलाकों में भारी बारिश हो रही है।
पूरे हैदराबाद में घने बादल छाए हुए हैं। अधिकारियों ने सतर्क रहने की चेतावनी जारी की है। मौसम विभाग ने कहा कि अगले तीन दिनों तक तेलुगु राज्यों में भारी से बहुत भारी बारिश होने की संभावना है। गरज के साथ छींटे पड़ने के भी आसार हैं।
హైదరాబాద్ లో దంచికొడుతోంది వాన, వాతావరణశాఖ హెచ్చరికలు
హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం ఐదు గంటల నుంచి వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి ఎక్కడికక్కడ వర్షపునీరు పారుతోంది. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 గంటల పాటు హైదరాబాదగ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రాంతంలో రోడ్లపై వర్షపు నీరు పారుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం 14 నీటమునిగింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్,పీర్జాది గూడా ప్రాంతాలలో దంచికొడుతోంది.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వాన పడుతోంది. చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ అంతటా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని హెచ్చరించింది.
29వ తేదీ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంది పేర్కొంది. మిగతా జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడతాయంది.
ఇక 30వ తేదీ సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు.
దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక 1వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ పడతాయని వాతావరణశాఖ తెలిపింది. అలాగే 2,3వ తేదీలలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణశాఖ ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. మాల్దీవుల నుంచి కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు, పిడుగులు పడతాయని చెబుతున్నారు. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు పొలం పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (ఏజెన్సీలు)