हैदराबाद : तेलंगाना बीजेपी के अध्यक्ष बंडी संजय को पुलिस ने अवैध रूप से गिरफ्तार करने का आरोप लगाते हुए पार्टी ने हाईकोर्ट में अर्जेंट याचिका दायर की है। चूंकि उच्च न्यायालय में बुधवार को अवकाश था, इसलिए बीजेपी ने हाउस मोशन याचिका दायर किया और अनुरोध किया कि उनकी याचिका की सुनवाई न्यायाधीश के आवास पर की जाए। बंडी प्रत्यक्षीकरण याचिका में संजय को तुरंत अदालत में पेश करने का आदेश देने की मांग की गई थी।
भाजपा भाग्यनगर जिला अध्यक्ष एस सुरेंद्र रेड्डी ने यह याचिका दायर की। हालांकि, महाधिवक्ता के कार्यालय द्वारा यह सूचित करने के बाद कि संजय को गिरफ्तार कर रिमांड पर भेज दिया गया है। इसके चलते प्रधान न्यायाधीश उज्जल भुइयां ने हाउस मोशन याचिका पर सुनवाई से इनकार कर दिया। संबंधित जज ने रजिस्ट्री को गुरुवार को पहले मामले की जांच के लिए कदम उठाने के निर्देश जारी किए हैं।
इसी क्रम में बंडी संजय की जमानत याचिका पर गुरुवार को स्थानीय हनुमाकोंडा कोर्ट में सुनवाई होने वाली है। वकीलों ने दावा किया कि बंडी संजय के खिलाफ दायर मामला गंभीर नहीं है। जमानत जरूर मिल जाएगी। बंडी संजय जेल से रिहा हो जाएगे।
బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో నేడు విచారణ
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం హైకోర్టుకు సెలవు కావడంతో తమ పిటిషన్‌ను జడ్జి ఇంటి వద్దనే విచారణ చేయాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సంజయ్‌ను తక్షణమే కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని హెబియస్ కార్పస్ పిటిషన్‌లో కోరింది.
బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు ఎస్.సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. అయితే సంజయ్ ను అరెస్టు చూపించి, రిమాండ్‌కు పంపుతున్నట్లు అడ్వకేట్ జనరల్ కార్యాలయం సమాచారం ఇవ్వడంతో హౌస్‌మోషన్ పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నిరాకరించారు. దీనిపై సంబంధిత న్యాయమూర్తి గురువారం మొదటి కేసుగా విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో బండి సంజయ్ బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. బండి సంజయ్‌పై పెట్టిన కేసు సీరియస్ కాదని న్యాయవాదులు పేర్కొన్నారు. కచ్చితంగా బెయిల్ వస్తుంది. బండి సంజయ్ జైలు నుంచి విడుదల కానున్నారు. (ఏజెన్సీలు)