తెలుగు ప్రజలందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ : రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సూర్య భగవానుడి అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన రథ సప్తమి పర్వదినం ప్రకృతి పట్ల గౌరవాన్ని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని గుర్తు చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. సూర్యుడు సమస్త జీవరాశికి జీవనాధారమని, ఆయన కిరణాలు ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తిగా నిలుస్తాయని అన్నారు.

ఈ పవిత్ర దినం సందర్భంగా రైతాంగానికి మంచి పంటలు పండాలని, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

Also Read-

రథ సప్తమి పర్వదినం రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, సానుకూల మార్పులు తీసుకురావాలని కోరుకుంటూ, ప్రజలందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శుభసందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక రథ సప్తమి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X