హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతుందని అభివృద్ధి , సంక్షేమం రెండు జోడెద్దుల పరిగెడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ ప్రభుత్వ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ 65 వేల కి పైగా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆశయాలను నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read-
తమ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ ,విద్యా,వైద్యం , పారిశ్రామిక రంగం,సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లో తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తూ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన ప్రత్యేక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతో మంది త్యాగధనుల కృషి ఫలితం, తెలంగాణ అమరవీరుల పోరాటం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి పట్టుదలతో 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిందని ఆయన అన్నారు.

60 ఏళ్ల స్వరాష్ట్ర కాంక్షను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి సోనియాగాంధీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు..
