హైదరాబాద్ : నిర్మల్ కు చెందిన ప్రముఖ కవి కవియాత్ర వ్యవస్థాపక అధక్షులు కారం శంకర్, చైర్మన్ కారం నివేదిత, ఆధ్వర్యంలో తెలంగాణా భాషా సాంస్కృక శాఖ, సాహిత్య అకాడమి సౌజన్యంతో, పలు సాహితీ సాంస్కృతిక సంస్థ ల తో నిర్వహించిన మహా కవియాత్ర హైదరాబాదులో గన్ పార్కు నుండి గోల్కొండవరకు చేపట్టిన కవియాత్ర చారిత్రకమైనదని ముఖ్య అతిథి తెలంగాణ సి.ఎం. ఓయస్డి ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు.

సమాజంలో ప్రేమ శాంతి జ్ఞానం యెక్క ప్రాముఖ్యతను తెలుపుతూ వినూత్నంగా కవి యాత్ర ను రూపొందించడం అభినందనీయమని కారం శంకర్ ని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కొనియాడారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, కవియాత్ర కన్వీనర్ తెలుగు విశ్వ విద్యాలయం డైరెక్టర్ అయినంపూడి శ్రీలక్ష్మి లు మహాకవియాత్ర భాగ్యనగరంలో జరగడం అమోఘం అన్నారు.

తెలంగాణ అమరవీరుల స్థూపం, రవీంద్రభారతి వద్ద నుండి తెలుగు రాష్ట్రాల కవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కవియాత్ర ఒక సామాజికమైన చైతన్యయాత్ర అని ప్రముఖ వక్తలు కొనియాడారు. గోల్కొండ వరకు సాగిన ఈ యాత్ర అద్భుతమైదని అన్నారు. ప్రజలమధ్యలో కవిత్వం చదవడమనేది ఒక వినూత్నమైన ప్రక్రియయని .ప్రేమ శాంతి జ్ఞానం అను అంశంపై కవిత్వం వినిపించడం సామాజిక చైతన్యానికి దోహదపడుతుందని అన్నారు.

ఈ మహా కవియాత్రలో భారతదేశంలోని వివిధప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన, 300 మంది దాక కవయిత్రులు, కవులు పాల్గొని ప్రేమ శాంతి జ్ఞానం అనే అంశముపై వారిదైనా శైలిలో కవిత్వమును వినిపించారు. రవీంద్రభారతి సమావేశమందిరములోని రెండవ అంతస్తులో జరిగిన సభలో వివిధ సాహిత్య గ్రంథాలను ఆవిష్కరించారు.

ప్రత్యేకంగా తెలుగు సాహిత్య కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కా రామదాసు కవియాత్ర అధ్యక్షులు కారం శంకర్, కారం నివేదిత దంపతులను ఆత్మీయంగా సన్మానించారు. ముందుగా అమరవీరుల స్తూపం నుండి రవీంద్రభారతి వరకు కవియాత్ర జయహో, కవియాత్ర వర్ధిల్లాలి, జై కవియాత్ర – ప్రేమ శాంతి జ్ఞానం నినాదాలతో సాగింది.

అనంతరం భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన టూరిజం శాఖ నుంచి వచ్చిన మూడు బస్సుల్లలో కవులు కవయిత్రులు కూర్చున్నారు, బస్సు ముందు ముఖ్య అతిథి దేశపతి శ్రీనివాస్, ఆకుపచ్చ జెండా ఊపి ప్రారంభించారు మరో అతిథి మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. గోల్కొండలో కవితాగానం చేసిన కవులందరికి శాలువా ప్రశంసాపత్రాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా నుండి జిల్లా నుండి కవియాత్ర చైర్మెన్ కె. నివేదిత, ప్రముఖకవులు, నాళేశ్వరం శంకరం, అమ్మంగి వేణుగోపాల్ సాధనాల వెంకటస్వామి నాయుడు వై ఉమామహేశ్వరరావు రఘువీర్ ప్రతాప్ సిలువేరు లింగమూర్తికందుకూరి శ్రీ రాములు మడిపల్లి దక్షిణ మూర్తి, తెలంగాణ తల్లి రూపశిల్పి బి.వి.ఆర్ చారి, డా దామెర రాములు, కుర్మె హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.