हैदराबाद: जीएचएमसी के अधिकार क्षेत्र में वित्तीय वर्ष 2022-23 में रिकॉर्ड स्तर पर संपत्ति कर एकत्र किया गया है। अधिकारियों ने 2 हजार करोड़ रुपए वसूलने का लक्ष्य रखा था, लेकिन ऐसा नहीं हो पाया। हालाँकि, 1,640 करोड़ रुपये एकत्रित किए गए। शुक्रवार को अंतिम दिन होने के कारण बलदिया कार्यालयों में नागरिक सेवा केंद्र रात 11 बजे तक खुले रहे।
सुबह व शाम के समय में बड़ी संख्या में संपत्ति ओनर पहुंचे। नतीजा यह हुआ कि एक दिन में 40 करोड़ रुपये से ज्यादा का टैक्स वसूल हो गया। 2019-20 में 1,357 करोड़ रुपये, 2020-21 में 1,633 करोड़ रुपये, 2021-22 में 1,495 करोड़ रुपये और 2022-23 में 1,640 करोड़ रुपये वसूल किये गये।
జీహెచ్ఎంసీ 2022–23 కలెక్షన్ రూ. 1,640 కోట్లు
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. అధికారులు 2 వేల కోట్లు కలెక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఆ మేరకు కాలేదు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,640 కోట్లు రాబట్టారు. శుక్రవారం చివరి రోజు కావడంతో బల్దియా ఆఫీసుల్లోని సిటిజన్ సర్వీస్సెంటర్లను రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రాపర్టీ దారులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఒక్కరోజులో రూ.40 కోట్లకుపైగా ట్యాక్స్ వసూలైంది. 2019–20 సంవత్సరంలో రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22 రూ.1,495 కోట్లు రాగా 2022–23లో రూ.1,640 కోట్లు వసూలవడం విశేషం. (ఏజెన్సీలు)