Happy Journey: TGSRTC करीमनगर बस स्टैंड में जन्मी बच्ची के लिए खुश खबर, जीवन भर मुफ्त यात्रा और…

हैदराबाद: हाल ही में करीमनगर बस स्टैंड में एक गर्भवती महिला ने एक सुंदर बच्ची को जन्म दिया है। जब बस स्टैंड में गर्भवती महिला प्रसव के दर्द से तड़प रही थी, तो आरटीसी स्टाफ और सहयात्रियों ने बस स्टैंड में ही प्रसव कार्य में सहयोग किया। महिला ने एक सुंदर बच्ची को जन्म दिया। जैसे ही यह घटना सोशल मीडिया पर वायरल हुई तो आरटीसी कर्मचारियों द्वारा किए गए काम की प्रशंसा होने लगी।

टीजीएसआरटीसी ने हाल ही में इस घटना पर प्रतिक्रिया दी और घोषणा की कि लड़की को जीवन भर तेलंगाना की बसों में मुफ्त यात्रा प्रदान की जाएगी। इसी क्रम में बच्ची को जीवनभर मुफ्त बस पास उपलब्ध कराया जाएगा। आरटीसी अधिकारियों ने खुलासा किया कि यह निर्णय आरटीसी बसों और बस स्टेशनों पर जन्म लेने वाले बच्चों को जीवन भर मुफ्त बसपास देने के आरटीसी प्रबंधन द्वारा लिए गए पहले निर्णय के अनुसार लिया गया।

इस महीने की 16 तारीख को टीजीएस आरटीसी प्रबंधन ने करीमनगर बस स्टेशन के उन कर्मचारियों को सम्मानित किया, जिन्होंने साड़ी बांधकर और प्रसव दर्द से पीड़ित एक गर्भवती महिला के प्रति मानवता दिखाई। बुधवार को हैदराबाद बस भवन में आयोजित इस कार्यक्रम में टीजीएस आरटीसी के एमडी वीसी सज्जनर ने आरटीसी अधिकारियों के साथ कर्मचारियों को सम्मानित किया।

गौरतलब है कि इसी महीने की 16 तारीख को कुमारी नाम की एक गर्भवती महिला अपने पति के साथ भद्राचलम जाने के लिए बस के लिए करीमनगर बस स्टेशन पहुंची। लेकिन उसी समय उसे प्रसव दर्द होने लगा। करीमनगर बस स्टैंड पर आरटीसी स्टाफ ने महिला को देखा और तुरंत 108 पर कॉल कर जानकारी दी। दर्द बढ़ने पर आरटीसी महिला कर्मचारी मैदान में उतरीं। सामान्य प्रसव के बाद साड़ियों से पीड़ित महिला को ढक दिया। इसके बाद महिला ने एक बच्ची को जन्म दिया।

इसके बाद मां और बच्चे को तुरंत एंबुलेंस से सरकारी अस्पताल ले गये। डॉक्टरों ने बताया कि मां और बच्ची ठीक हैं। यात्रियों के अलावा, सोशल मीडिया पर नेटिज़न्स ने भी साड़ी से ढककर करीमनगर बस स्टेशन में दर्द से पीड़ित गर्भवती महिला को प्रसन के दौरान मानवता दिखाने वाले आरटीसी कर्मचारियों की प्रशंसा की है। प्रबंधन ने टीजीएसआरटीसी स्टाफ को हैदराबाद बस भवन में सम्मानित किया और बधाई दी।

इस अवसर पर टीजीएसआरटीसी के एमडी वीसी सज्जनार ने आरटीसी स्टाफ- सैयदम्मा, लावण्या, श्रवंती, भवानी, रेणुका, रजनी कृष्णा और अंजय्या की सेवाओं की सराहना की। उन्होंने आपातकाल में स्टॉफ की ओर से उठाये गये कदमों की सराहना की। उन्होंने कहा कि यह सराहनीय है कि यात्रियों को सुरक्षित उनके गंतव्य तक पहुंचाया जा रहा है और आपात स्थिति में उन्हें इस तरह के कार्य से आश्वस्त किया जा रहा है।

टीजीएस आरटीसी प्रबंधन ने घोषणा की है कि बस स्टेशन में जन्म लेने वाली बच्ची को जीवन भर उनकी बसों में मुफ्त यात्रा के लिए बस पास दिया जाएगा। आरटीसी बसों और बस स्टेशनों पर जन्म लेने वाले बच्चों को जीवन भर मुफ्त बस पास देने के प्रबंधन द्वारा लिए गए पिछले निर्णय के अनुसार, इस लड़की को जन्मदिन के उपहार के रूप में जीवन भर मुफ्त बस पास दिया जा रहा है।

బస్టాండ్‌లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీలో జీవితాంతం ఫ్రీ జర్నీ

హైదరాబాద్ : ఇటీవల కరీంనగర్ బస్టాండ్‌లో ఓ గర్భిణీకి ప్రసవం జరిగిన సంగతి తెలిసిందే. బస్టాండ్‌లో ఉన్న ఆ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆర్టీసీ సిబ్బంది, తోటి ప్రయాణికుల సాయంతో బస్టాండ్‌లోనే పురుడు పోశారు. ఆ మహిళకు ఆడబిడ్డ పుట్టింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ సిబ్బంది చేసిన పనికి ప్రశంసల జల్లు కురిసింది.

తాజాగా ఈ సంఘటనపై స్పందించిన టీజీఎస్ ఆర్టీసీ ఆ చిన్నారికి జీవిత కాలం తెలంగాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి జీవితకాలం ఫ్రీ బస్‌పాస్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలం ఉచిత బస్‌పాస్‌ను ఇవ్వాలని గతంలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

ఈ నెల 16 వ తేదీన కరీంనగర్ బస్ స్టేషన్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. హైదరాబాద్ బస్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

ఈ క్రమంలోనే ఈ నెల 16 వ తేదీన కూమారి అనే నిండు గర్భిణీ తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కరీంనగర్ బస్టాండ్‌లోని ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి సమాచారం అందించారు. ఆ లోగానే నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది రంగంలోకి దిగారు. చీరలను అడ్డుపెట్టి కుమారికి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల జన్మించింది.

వెంటనే అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వతా తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కరీంనగర్ బస్ స్టేషన్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి చీరను అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటుకున్నన ఆర్టీసీ సిబ్బంది పట్ల అక్కడ ఉన్న ప్రయాణికులే కాకుండా సోషల్ మీడియాలోని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో మహిళకు ప్రసవం చేసిన టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిని హైదరాబాద్ బస్ భవన్‌లో ఆ సంస్థ బుధవారం అభినందించింది.

ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. ఆపదలో సమయస్ఫూర్తితో వ్యవహారించిన వారిని పొగిడారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారిని ఆపద సమయంలో భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని తెలిపారు.

బస్ స్టేషన్‌లో పుట్టిన ఆ చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X