हैदराबाद: शहर में आवारा कुत्तों का आतंक दिन पर दिन बढ़ता ही जा रहा है। हैदराबाद में आवारा कुत्तों के हमले में एक चार साल के बच्चे की मौत हो गई। इस घटना ने नगरवासिययों को झकझोर कर रख दिया है।
बागअंबरपेट में रहने वाले गंगाधर अपने बेटे प्रदीप को सर्विस सेंटर ले गया। उसके बाद गंगाधर वहां से चला गया। आवारा कुत्तों ने बाहर निकल रहे बच्चे को घेर लिया और हमला किया। कुत्तों के हमले में बच्चा गंभीर रूप से घायल हो गया।
इसके बाद दो कुत्तों ने बच्चे को मुंह में पकड़कर इधर से उधर घसीटते हुए ले गए। इसके चलते बच्चे की मौत हो गई। इस घटना जुड़े विजुअल वहां पर लगे सीसीटीवी कैमरों में रिकॉर्ड हो गए।
शहर में आवारा कुत्तों के हमले में चार साल के बच्चे की मौत मंत्री केटीआर ने इस घटना पर प्रतिक्रिया दी। मंत्री केटीआर ने बच्चे के परिजनों के प्रति संवेदना व्यक्त की। उन्होंने कहा कि यह घटना बेहद दुखद है।
వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ : నగరంలో రోజురోజుకూ వీధి కుక్కల బెడద మరింత ఎక్కువవుతోంది. హైదరాబాద్ లో తాజాగా జరిగిన వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచి వేస్తోంది.
బాగ్ అంబర్ పేటలో ఉంటున్న గంగాధర్ తన కొడుకు ప్రదీప్ ను సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
ఆ తర్వాత బాలున్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో చనిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సంతాపం
నగరంలో వీధి కుక్కల దాడిలో అయిదేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈ ఘటన చాలా విషాదకరమని అన్నారు.
Hyderabad | A 5-yr-old boy, Pradeep mauled to death by stray dogs on 19th Feb. He was rushed to a hospital but was declared brought dead.
— ANI (@ANI) February 21, 2023
Gangadhar, the boy's father & a security guard had taken him to his workplace & the dogs attacked him while he was roaming alone
(Pic: CCTV) pic.twitter.com/yeZB6DGSLx
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.(ఏజెన్సీలు)