Formula E Race: ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు మరియు…

హైద‌రాబాద్ : ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్ బండ్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. మ‌రికాసేప‌ట్లో ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగ‌ర్ తీరంలో ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ మార్గ్, మింట్ కంపౌండ్ వైపు రాక‌పోక‌ల‌ను బంద్ చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు కొన‌సాగ‌నున్నాయి. వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రేస్‌లు నెక్లెస్‌ రోటరీ నుంచి తెలుగుతల్లి జంక్షన్‌, ఓల్డ్ సెక్ర‌టేరియ‌ట్‌ నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్, మింట్‌ కంపౌండ్ మీదుగా ఐమాక్స్‌ వరకు కొన‌సాగుతాయి.

ట్రాఫిక్‌ మళ్లింపు

-వీవీ విగ్రహం(ఖైరతాబాద్‌) వైపు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు ట్రాఫిక్‌ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజ్‌, రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
-బుద్దభవన్‌, నల్లంపట్ట జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.
-రసూల్‌పురా, మినిస్టర్‌ రోడ్డు నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్‌ వద్ద రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.
-ఇక్బాల్‌ మినార్‌ నుంచి తెలుగుతల్లి జంక్షన్‌, ట్యాంక్‌ బండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాలి.
-ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌, రవీంద్ర‌ భారతి జంక్షన్‌ వైపు వెళ్లాలి.
-బీఆర్‌కే భవన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌మినార్‌, రవీంద్ర‌ భారతి జంక్షన్‌కు మళ్లిస్తారు.
-ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి మింట్‌కంపౌండ్‌ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర‌ భారతి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
-ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వైపు నుంచి ప్రింటింగ్‌ ప్రెస్‌, నెక్లెస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్‌ వద్ద రాజ్‌దూత్‌ లైన్‌లోకి మళ్లిస్తారు.

ఆర్టీసీ బస్సులు

అఫ్జల్‌గంజ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్, కట్టమైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, బీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ రూట్లలోకి మళ్లిస్తారు.

ఫార్ములా ఈ రేస్

ఇండియా మోటార్​ స్పోర్ట్స్​ రేసింగ్​ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్​ వేదికైంది. దేశంలో తొలి స్ట్రీట్​ సర్క్యూట్​ రేసుకు మన భాగ్యనగరం ఆతిథ్యం ఇస్తోంది. మన దేశంలో మోటార్​ స్పోర్ట్స్​కు ఆదరణ పెంచి, టాలెంటెడ్​ రేసర్లను ప్రోత్సహించేందుకు రూపొందిన ఇండియన్​ రేసింగ్​ లీగ్​ (ఐఆర్​ఎల్) తొలి సీజన్​లో మొదటి రౌండ్​ పోటీలు హుస్సేన్​ సాగర్​ తీరాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్​ సర్క్యూట్​లో శని, ఆదివారాల్లో జరగనున్నాయి. ఈ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్​ బ్లాక్​బర్డ్స్​ సహా ఆరు జట్లు బరిలో నిలిచాయి. ప్రతి జట్టుకు నలుగురు చొప్పున ఇండియా, ఫారిన్​కు చెందిన మొత్తం 24 మంది రేసర్లు పోటీ పడతారు. గంటకు దాదాపు 240 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తారు. లుంబినీ పార్క్​, హుస్సేన్​సాగర్​, ఐమాక్స్​ థియేటర్​ నుంచి ఎన్టీయార్​ మార్గ్​ గుండా తిరిగి లుంబినీ పార్క్​ మీదుగా 2.7 కిలోమీటర్ల ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. ఇందులో 17 మలుపులు ఉన్నాయి. ప్రత్యేక ట్రాక్​ చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ నుంచి ఫ్యాన్స్​ పోటీలు చూడొచ్చు. ఈ రేసును స్టార్​ స్పోర్ట్స్​ చానెల్​ లైవ్​ టెలీకాస్ట్​ చేస్తుంది. 

ఇండియాలో తొలి రేసింగ్​ లీగ్​ ఇది. తొలి ఎడిషన్​లో హైదరాబాద్​ బ్లాక్​బర్డ్స్, స్పీడ్​ డెమోస్​ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్​స్టర్స్​, చెన్నై టర్బో రైడర్స్​, గోవా ఏసెస్​, గాడ్​స్పిన్​ కొచ్చి అనే ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. ప్రతి జట్టులో ఓ మహిళ సహా నలుగురు రేసర్లు ఉన్నారు. ఈ లీగ్​ నాలుగు రౌండ్లలో జరుగుతుంది. తొలి, చివరి రౌండ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ​, రెండు (ఈనెల 26–27), మూడో (డిసెంబర్​ 2–4) రౌండ్లను చెన్నైకి కేటాయించారు.

వచ్చే నెల 10,11వ తేదీల్లో సిటీలోనే చివరి, ఫైనల్​ రౌండ్​ పోటీలు జరుగుతాయి. చెన్నైలో సపరేట్​ ఇంటర్నేషనల్​ సర్య్కూట్​ఉండగా.. హైదరాబాద్​లో మాత్రం సాధారణ దారిలోనే రేసు కోసం ప్రత్యేకంగా రోడ్డు వేశారు. అందుకే దీన్ని స్ట్రీట్​ సర్క్యూట్​ అని పిలుస్తున్నారు.

ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు రౌండ్లు ప్రతీ వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తారు. ప్రతి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్వాలిఫికేషన్స్​, రెండు స్ప్రింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులు ఉంటాయి. శనివారం మధ్యాహ్నం పదేసి నిమిషాల నిడివిలో రెండు క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒక స్ప్రింట్ (రేస్​1, 20 నిమిషాలు)​ జరుగుతుంది. ఆదివారం మరో స్ర్పింట్ (రేస్​2, 20 నిమిషాలు) నిర్వహిస్తారు. ఈ రేసుల్లో ప్రతి జట్టు నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది రేసర్లు (12 కార్లు) ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెళ్తారు. మూడో, ఫీచర్ రేసులో ఇద్దరేసి డ్రైవర్లతో 40 నిమిషాల పాటు పోటీ జరుగుతుంది. మధ్యలో కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారే అవకాశం ఇస్తారు. 40 నిమిషాల్లో ఎక్కువ ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పూర్తి చేసిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 25 పాయింట్లు సాధిస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన వాటికి వరుసగా 18, 15, 12, 10 పాయింట్లు ఇస్తారు. మొత్తం నాలుగు రౌండ్లలో ఎక్కువ పాయింట్లు నెగ్గిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ గెలుస్తుంది. 

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఫార్ములా 1, 2, 3, 4 రేసింగ్​లు జరుగుతున్నాయి. ఫార్ములా- 1 ( ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1)హయ్యెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందులో పాల్గొనాలంటే 4, 3, 2 రేసింగ్​లను దాటి రావాలి. ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఫార్ములా 3 లెవెల్లో ఉంటుంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో వివిధ కంపెనీల కార్లు పోటీ పడతాయి. ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం అన్ని జట్లూ.. ఇటలీకి చెందిన వోల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ రూపొందించిన కార్లనే (వోల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీబీ08) వాడుతాయి. 1100 సీసీ ఇంజన్,​ 380 కిలోల బరువుతో ఉండే కార్లు గంటకు గరిష్టంగా240 కిలోమీటర్ల స్పీడుతో దూసుకుపోతాయి.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఇండియాలో తొలిసారి జరిగే ఫార్ములా- ఇ రేసుకు హైదరాబాద్​ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, దానికి ఇప్పుడు జరిగే ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధం లేదు. ఫార్ములా- ఇ రేసులో బ్యాటరీతో నడిచే హైఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్లనే ఉపయోగిస్తారు. ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హై ఆక్టేన్​ పెట్రోల్​కార్లను వాడుతున్నారు. అయితే, ఇదే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫార్ములా- ఇ రేసు ఉంటుంది కాబట్టి దానికి ఐఆర్​ఎల్​ లో హైదరాబాద్​ సర్క్యూట్ పోటీలు​ ట్రయల్​ రన్​లా పని చేయనుంది. ఐఆర్​ఎల్​ నిర్వహణ ద్వారా ట్రాక్​, దాని నాణ్యత ఎలా ఉంది, ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలు ఫార్ములా- ఇ నిర్వహించడానికి ఫీడ్​ బ్యాక్​గా ఉపయోగపడుతుంది. ట్రాక్​, ఏర్పాట్లలో మార్పులు చేయాల్సి ఉందేమో ఈ రేస్​ ద్వారా నిర్వాహకులకు అవగాహన వస్తుంది.

మన హైదరాబాద్ మరో మెగా ఈవెంట్​కు ఆతిథ్యమిస్తోంది. క్రికెట్ సహా ఎన్నో ఆటలకు వేదికైన సిటీ.. తొలిసారి మోటార్​ స్పోర్ట్​ రేసింగ్​కు రెడీ అయింది. ఇండియన్​ రేసింగ్​ లీగ్ (ఐఆర్ఎల్) తొలి రౌండ్ ​పోటీలు శని, ఆదివారాల్లో హుస్సేన్​సాగర్ ​తీరంలో జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సహా ఆరు జట్లు, 24 మంది రేసర్లు పాల్గొంటున్నారు. వీళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ట్రాక్​పై 1,100 సీసీ సామర్థ్యంతో కూడిన ఫార్ములా- 3 లెవెల్ ​కార్లలో 240 కి.మీ వేగం వరకు దూసుకెళ్లనున్నారు. దేశంలో ఇదే మొదటి స్ట్రీట్​ సర్క్యూట్​ లీగ్​ కావడం విశేషం. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X