हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी के दौरे के पहले फ्लेक्सी से अफरा-तफरी मची है। सिकंदराबाद इलाके में बीजेपी के खिलाफ फ्लेक्सी लगाये गये। हालांकि इन फ्लेक्स पर किसी भी पार्टी का कोई चिन्ह नहीं है, लेकिन यह स्पष्ट है कि इन्हें प्रतिद्वंद्वी दलों द्वारा लगाया गया है। शुक्रवार 7 अप्रैल की शाम को फ्लेक्सी सिकंदराबाद इलाके में सड़कों के किनारे दिखाई दिए।
दो फ्लेक्सी प्रमुखता दर्शन दे रहे हैं। बीजेपी अचीवमेंट्स शीर्षक वाले इंडिया चार्ट में संबंधित राज्यों में जांच एजेंसियों द्वारा की गई छापेमारी की खबरें शामिल हैं। परिवार वेलकम यू मोदी जी नाम की एक और फ्लेक्सी में भाजपा में उत्तराधिकार की राजनीति पर छपे चित्रों और उनके नामों वाली एक फ्लेक्सी दिखाई दे रही है।
ప్రధాని మోడీ పర్యటన క్రమంలో ఫ్లెక్సీల కలకలం
హైదరాబాద్ : మోడీ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల కలకలం. ప్రధాని మోడీ పర్యటించే సికింద్రాబాద్ ప్రాంతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ఎలాంటి పార్టీ గుర్తులు లేకపోయినా ప్రత్యర్థి పార్టీలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్ల పక్కన వెలిశాయి.
రెండు ఫ్లెక్సీలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. బీజేపీ అచీవ్ మెంట్స్ పేరుతో భారతదేశం బొమ్మలో ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల దాడులకు సంబంధించిన వార్తల క్లిప్పింగ్స్ ఉన్నాయి. మరో ఫ్లెక్సీలో పరివార్ వెల్ కమ్స్ యూ మోడీ జీ అనే పేరుతో బీజేపీలో వారసత్వ రాజకీయం అంటూ ఫొటోలు, వారి పేర్లు ముద్రించిన ఫ్లెక్సీ దర్శనం ఇచ్చింది.
ఏప్రిల్ 8వ తేదీ హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీ 11 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించబోతున్నారు.
అదే విధంగా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్న ప్రధాని మంత్రికి గ్రాండ్ గా వెల్ కం చెప్పాల్సిన వాళ్లు అందుకు భిన్నంగా చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ పర్యటనకు హాజరుకాకూడదని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించుకోగా బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. (ఏజెన్సీలు)