तेलंगाना में तेज रफ्तार दो कारों की आमने-सामने टक्कर, पांच लोगों की मौके पर ही मौत AND…

हैदराबाद: तेलंगाना में भीषण सड़क हादसा हो गया। रविवार शाम को नारायणपेट जिले के मकतल मंडल के जकलेर राष्ट्रीय राजमार्ग पर तेज रफ्तार दो कारों की आमने-सामने टक्कर हो गई।

इस हादसे में पांच लोगों की मौके पर ही मौत हो गई। जबकि दो अन्य गंभीर रूप से घायल हो गए। घायलों की हालत चिंताजनक है। स्थानीय लोगों से सूचना मिलने के बाद पुलिस तुरंत मौके पर पहुंची और राहत और बचाव कार्य में जुट गई।

मृतकों की पहचान कर्नाटक और महाराष्ट्र से संबंधित के रूप में की गई है। हादसे में दो कारें चकनाचूर हो गईं। हादसे के कारण हाईवे पर भीषण ट्रैफिक जाम हो गया। इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే మృతి

హైదరాబాద్: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం నారాయణ పేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

మృతులను కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. యాక్సిడెంట్ కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు, ప్రయాణికులందరు సురిక్షితం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో టైర్లు ఊడిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాద ఘటనపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్‌-హన్మకొండ రూట్​లో వెళ్తున్న TS 02 UC 5936 నెంబర్‌ గల బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమ వైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయని, ఈ ప్రమాదంలో బస్సు కొద్దిగా డ్యామేజ్‌ అయిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. 

ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని సజ్జనార్ తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. బస్సు ప్రమాద ఘటనపై వెంటనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X