हैदराबाद : सीएम रेवंत रेड्डी ने संगारेड्डी जिले के चंदापुर केमिकल इंडस्ट्री में रिएक्टर विस्फोट की घटना पर दुख जताया है। सीएम रेवंत रेड्डी ने हादसे में मारे गए लोगों के परिवारों के प्रति संवेदना व्यक्त की है। अग्निशमन सेवा डीजी नागिरेड्डी को तुरंत मौके पर जाने और बचाव कार्यों की निगरानी करने का निर्देश दिया गया। जिला कलेक्टर और एसपी को पीड़ितों को बेहतर चिकित्सा उपचार प्रदान करने के लिए सभी उपाय करने के लिए सचेत किया।
गौरतलब है कि संगारेड्डी जिले के हतनुर मंडल की चंदापुर केमिकल फैक्ट्री में अग्नि दुर्घटना घटी है। स्थानीय एसबी ऑर्गेनिक्स में रिएक्टर फटने से पांच श्रमिकों की मौत हो गई और 10 कर्मचारी घायल हो गए। हादसे के वक्त इंडस्ट्री में कुल 50 लोग काम कर रहे थे। मरने वालों की संख्या बढ़ने की आशंका है। घायलों को इलाज के लिए संगारेड्डी एरिया अस्पताल में भर्ती कराया गया है। रिएक्टर विस्फोट के प्रभाव के कारण औद्योगिक क्षेत्रों में कई संरचनाएं ढह गईं। रिएक्टर विस्फोट के कारण स्थानीय लोग दहशत में हैं। पुलिस मौके पर पहुंच गई है और इंडस्ट्री के आसपास के इलाकों से लोगों को खाली कराया गया है।
सबसे पहले फैक्ट्री में एक रिएक्टर में विस्फोट हुआ और आग फैल गई। इस हादसे में मैनेजर रवि और चार अन्य कर्मचारियों की मौत की पुष्टि हुई है। धमाके से डायरेक्टर रवि, सुब्रमण्यम, सुरेश, पॉल और दामोदर की मौके पर ही मौत हो गई। करीब 10 लोग घायल हुए हैं। दमकलकर्मी चार दमकल गाड़ियों से आग बुझाये हैं। रिएक्टर विस्फोट के कारण आसपास की तीन इमारतें ढह गईं। कुछ और कर्मचारी मलबे में दबे होने की आशंका हैं। पुलिस मामले की छानबीन कर रही है।
చందాపూర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా చందాపూర్ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలి పారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి అలెర్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక SB ఆర్గానిక్స్ లో రియాక్టర్లు పేలడంతో ముగ్గురు కార్మికులు చనిపోయారు.10మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో మొత్తం 50 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చికిత్సకోసం గాయడిన వారిని సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రియాకర్టర్ పేలిన తాకిడికి పరిశ్రమ ప్రాంతాల్లోని పలు నిర్మాణాలు కూలిపోయాయి.రియాక్టర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురవు తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..పరిశ్రమ పరిసర ప్రాంతాలనుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
ఫ్యాక్టరీలో మొదట ఒక రియాక్టర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మేనేజర్ రవితోపాటు మరో నలుగురు కార్మికులు చనిపోయినట్లు నిర్ధారించారు. పేలుడు ధాటికి డైరెక్టర్ రవి, సుబ్రమణ్యం, సురేష్, పాల్, దామోదర్ స్పాట్ లోనే చనిపోయారు. దాదాపు 10మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు ఫైర్ సిబ్బంది. రియాక్టర్ పేలుడుతో సమీపంలోని మూడు భవనాలు కుప్పకూలాయి. ఈ శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు ఉండొచ్చని సహాయక చర్యలు చేపట్టారు. (ఏజెన్సీలు)