हैदराबाद: तेलुगु के मशहूर फिल्म अभिनेता, निर्देशक और निर्माता आर नारायण मूर्ति अस्वस्थ हो गये। उनके परिजनों ने बुधवार दोपहर को उनकी हालत देखी और तुरंत उन्हें इलाज के लिए हैदराबाद के निम्स अस्पताल में भर्ती कर दिया। डॉक्टरों ने बताया कि नारायण मूर्ति इलाज डॉ. बिरप्पा की देखरेख में ठीक प्रकार से जारी हैं। उनके अस्वस्थ होने की खबर से उनके प्रशंसक चिंतित हो गये हैं। इसलिए पीपुल्स स्टार ने प्रशंसकों के लिए एक महत्वपूर्ण घोषणा की है।
यह भी पढ़ें-
నేను ఆరోగ్యంగానే ఉన్నా ఆందోళన చెందకండి: సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి అస్వస్థతకు లోనయ్యారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఆయన పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుండగా ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతుండంతో పీపుల్ స్టార్ ఫాన్స్‌ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.
తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు నారాయణ మూర్తి అభిమానులకు తెలియజేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నానని తెలిపారు. త్వరలోనే అభిమానుల ముందుకొస్తానని మాటిచ్చారు. కోలకున్నాక ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను నారాయణ మూర్తి వెల్లడించారు.
జూలై 17వ తేదీ ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడలేకపోయారు. నీరసంగా ఉందని కళ్లు తిరుగుతున్నట్లు చెప్పారు నారాయణమూర్తి. దీంతో ఆయన పక్కనే ఉన్న సినిమా వాళ్లు వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆర్. నారాయణమూర్తికి డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
రెండు నెలల క్రితమే ఆర్.నారాయణ మూర్తికి బైపాస్ సర్జరీ జరిగింది. గుండె నాళాల్లో బ్లాకులు ఉండటంతో.. బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఉండటంతో రావటం.. అక్కడ అస్వస్థతకు గురవటంతో నిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు. (ఏజెన్సీలు)