పాలకుర్తి : రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురుస్తాడు… వ్యవసాయం చూస్తే ఉరకలేస్తాడు…తోటోళ్లు పొలం పనులు చేస్తుంటే తను ఆగలేడు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాష్ట్రానికి మంత్రి అయినా… రైతుకు బిడ్డే.
కాబట్టి నేడు తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి దూకి… గొర్రు పట్టి ఎడ్లను సై అన్నారు… అయిచ్చారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. అందరితో కలిసి..గొంతు కలిపి నాట్లు వేశారు.
దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ గారు పండగ చేస్తే… ఆ వ్యవసాయాన్ని మంత్రులు కూడా పొలంలోకి దిగి బురద గొర్రు కొడుతున్నారు. మా నాయకుని ఆశయ సాధనలో అడుగులు వేస్తాం అనడమే కాదు..నేరుగా వ్యవసాయం చేస్తాం…రైతు రాజు అయితే… రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నారు.

కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. గతంలో నెర్రెలు పారిన పొలాలు… స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి… అన్నదాత కళ్లలో ఆనందం పండిస్తున్నాయి.

అపర భగీరధుడు కేసీఆర్ గారి ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే… చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే… మంత్రులు కూడా సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే… ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి…నా తెలంగాణ కోటి ఎకరాల మగాణా అన్న నినాదం నిజం అయ్యింది.