हैदराबाद: तेलंगाना के कामारेड्डी जिले के माचारेड्डी मंडल के लच्छपेटा गांव में आवारा कुत्तों के हमले में एक वृद्ध महिला की मौत हो गई। मुस्ताबाद रामव्वा (75) पर कुत्तों ने उस समय हमला किया जब वह घर पर अकेली थीं। उसके चेहरे और हाथ पर आवारा कुत्तों ने हमला कर गंभीर रूप से घायल कर दिया।
इसे देख ग्रामीणों ने आवारा कुत्तों को भगाया। खून से लथपथ और गंभीर रूप से घायल रामव्वा को कामारेड्डी सरकारी अस्पताल ले गये। वहां के डॉक्टरों ने उसे निज़ामाबाद जिला अस्पताल रेफर कर दिया। ग्रामीणों ने बताया कि रास्ते में रामव्वा की बीच रास्ते में मौत हो गयी. ग्रामीण सरकार से आग्रह किया हैं कि गांव में खुलेआम घूम रहे आवारा कुत्तों को रोकने के लिए आवश्यक कदम उठाएं।
కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి
హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చ పేట గ్రామంలో చోటు చేసుకుంది.ముస్తాబాద్ రామవ్వ (75) అనే వృద్ధురాలు పై ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటి వద్దనే కుక్కలు దాడి చేశాయి. ఆమె ముఖం చేతులు పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
ఇది గమనించిన గ్రామస్తులు వీధి కుక్కలను వెంటపడి తరిమి వేశారు. తీవ్రంగా గాయపడి రక్తస్రావంలో ఉన్న రామవ్వను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. గ్రామంలో విచ్చలవిడిగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు వాటిని నివారించే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. (ఏజెన్సీలు)