Hyderabad: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద రాం దేవ్ బాబా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ ఒక బాబా పేరు పెట్టుకొని మహిళలను ఇలా మాట్లాడడం చాలా దారుణమని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాందేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గీతారెడ్డి, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్, నగర మహిళ అధ్యక్షురాలు వరలక్మి తో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.