హైదరాబాద్ : మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలు పెద్దఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సునీతా రావ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్ లీక్ లు సహజంగా మారాయని విద్యావ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిందని విమర్శించారు.
టీఎస్పీఎస్సి పేపర్ లీక్ తో రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు గందరగోళం లో పడ్డారని అన్నారు. విద్యార్థులు, యువకుల కోసం కాంగ్రెస్ నాయకులు ఉద్యమిస్తే అరెస్టులు చేసి జైల్లో వేస్తున్నారని అన్నారు. పాలకుల దమన నీతికి వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు.