Covid-19 : पंद्रह छात्र कोरोना पॉजिटिव, मचा हड़कंप

हैदराबाद : तेलंगाना में एक बार फिर कोरोना से हड़कंप मच गया है। महबूबाबाद के जिला केंद्र में पुराने कलेक्टर कार्यालय के पास आदिवासी कल्याण बालक गुरुकुल स्कूल (Tribal Welfare Boys Gurukula School) में कोरोना के मामले सामने आए हैं। स्कूल प्रबंधन ने कहा कि छात्रावास में कुछ छात्रों को खांसी, जुकाम और बुखार के लक्ष्यण पाये जाने के कारण चिकित्सा कर्मचारियों द्वारा इलाज किया गया।

हालांकि, मेडिकल स्टाफ को छात्रों के लक्षणों पर संदेह हुआ और उन्होंने छात्रों के कोरोना परीक्षण किए। नतीजतन, 15 छात्र कोरोना पॉजिटिव निकले हैं। पॉजिटिव पाए गए छात्रों को छात्रावास के एक कमरे में आइसोलेशन में रखकर चिकित्सक इलाज कर रहे हैं।

दूसरी ओर, छात्रों में कोरोना की जानकारी का पता चलने के बाद बाकी छात्र दहशत में हैं। साथ ही छात्रों ने अपने-अपने माता-पिता को सूचित किया और उन्हें घर ले जाने का आग्रह किया है। नतीजतन, कुछ अभिभावक अपने बच्चों को घर ले जाने के लिए स्कूल पहुंचे हैं।

शिक्षकों का कहना है कि स्कूल में करीब 600 छात्र हैं। अन्य सभी छात्रों का परीक्षण किया जा रहा है। शिक्षक और डॉक्टर मिलकर छात्रों और अभिभावकों को सुझाव दे रहे हैं कि वे हर तरह के उपाय कर रहे हैं। किसी को डरने की जरूरत नहीं है।

తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం, 15 మంది విద్యార్థులకు పాజిటివ్

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి కరోనా కలకలం మొదలైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. హాస్టల్‌లో కొంతమంది మంది విద్యార్థులకు దగ్గు, జలుబు, జ్వరం ఉండటంతో వైద్య సిబ్బందితో చికిత్స అందించారు పాఠశాల నిర్వాకులు.

అయితే విద్యార్థులకు ఉన్న లక్షణాలపై వైద్య సిబ్బందికి అనుమానంతో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్థులను హాస్టల్‌లోని ఓ గదిలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

మరోవైపు ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమ తల్లిదండ్రులకు సమాచారం అందించి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లడానికి పాఠశాలకు వచ్చారు.

పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మిగతా అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరూ బయపడాల్సిన అవసరం లేదని అన్ని రకాల చర్యలు తీసుకుంటామని విద్యార్థులు, తల్లిందండ్రులకు.. ఉపాధ్యాయులు, వైద్యులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తుండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. చాలా రోజులుగు ఎలాంటి కేసులు నమోదు కాకుండా మళ్లీ ఇప్పుడు కేసులు వస్తుండటంతో ఇంకేం వేరియంట్ వచ్చిందోనని జనాలు భయపడుతున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కేసులపై వైద్యులు అధ్యాయనం చేస్తున్నారు. కొత్త వేరియంటా లేదా సాధారణ కోవిడ్ లక్షణాలు మాత్రమే కనిపించి తగ్గిపోయేదా అనేది తేల్చాల్సిఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X