హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బి. ఆర్. ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గా మాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్ధించారు. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ కేసీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Also Read-
తెలంగాణ భవన్ లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి
మరోవైపు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ నేతలు ఆ ఇద్దరు మహనీయులకు తెలంగాణ భవన్ లో ఘనంగా నివాళులర్పించారు.

శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూదనా చారి, మాజీ ఎంపీ లు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బాల్కసుమన్, బీ అర్ ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డి, కురువ విజయ్ కుమార్, అజం అలీ ,బద్రుద్దీన్ తదితరులు గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళుర్పించారు
