“మహిళా భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు?”

రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు?

మంత్రి సీతక్క ను అడ్డగించి నిలదీసిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై ఆగష్టు 31 న జరిగినట్వంటి అత్యాచారం మరియు హత్య యత్నంను ఉద్దేశించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పిలుపునిచ్చారు.

దానిలో భాగంగా ఈరోజు గాంధీ హాస్పిటల్ లో ఉన్న బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్లిన శిల్పారెడ్డి బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసనిచ్చారు. మహిళ పై జరిగింది హత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పినా మంత్రి సీతక్క ఈ కేసుని పక్కతోవ పట్టించే తీరును నిరసిస్తూ మహిళకి న్యాయం జరగాలని గాంధి హాస్పిటల్ ముందు బైటాయించిన శిల్పారెడ్డి బాధిత.

మహిళా కుటుంబానికి జరిగిన అన్యాయం ని పక్కతొవ్వ పట్టించడానికి వచ్చిన మంత్రి సీతక్క ని నీలదీసి ఈ సంఘటనను అత్యాచారం మరియు హత్య యత్నం గానే చూడాలని కమ్యూనల్ ఇష్యూ గా చిత్రికరించవద్దని సూటిగా మంత్రిని హెచ్చరించిన శిల్పారెడ్డి. వెంటనే నిందితుడికి SC/ST అట్రాసిటీ, అత్యాచార మరియు హత్యయత్నం కేసులు పెట్టి ఉరిశిక్ష విధించి బాధిత మహిళకి న్యాయం చేకూర్చాలని లేనియెడల రాష్ట్ర మహిళా మోర్చా తరుపున ముందు ముందు చెప్పట్టపోయే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని శిల్పారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read-

డా. కళ్యాణ్ నాయక్ ఫిర్యాదు మేరకు స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జైనురు కు చెందిన గిరిజన ఆదివాసి గోండు మహిళల నీలాబాయి పై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుసుకొని గాంధీ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ మరియు బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్. బాధిత మహిళను పరామర్శించిన అనంతరం మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్ కు ఆదేశించారు అదేవిధంగా రాష్ట్ర డిజిపి కి పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష మాట్లాడుతూ…. ఆసిఫాబాద్ లో ఆదివాసి మహిళపై జరిగిన లైంగికదాడి ఘటన చాలా బాధాకరం. అగస్టు 31న సంఘటన జరిగితే రెండురోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.

షేక్ మగ్దూం అనే వ్యక్తి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు స్పష్టంగా తెలిపినా పోలీసులు పట్టింపులేకుండా వ్యవహరించడం దారుణం. భారతీయ జనతా పార్టీ మహిళామోర్చా నాయకులు బాధితురాలి ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే, అత్యాచారం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం హేయనీయం.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. నిందుతుడిపైన కఠిన చర్యలు తీసుకొని, బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని గత నెల 23వ తేదీన ఆదివాసి సంఘాలు ధర్నా చేస్తే వారిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు.

అమాయక ఆదివాసీ మహిళలు, యువకులపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరించడం హేయనీయం. రాష్ట్ర ప్రభుత్వం దోషులను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి. ఆదివాసులకు మంత్రి సీతక్క గారు క్షమాపణ చెప్పాలి.

రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా… రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడేలా వ్యవహరిస్తోంది. సంఘటన జరిగి నాలుగైదు రోజులు గడిచినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆదివాసి సంఘాలు నిన్న ధర్నా చేస్తే అప్పుడు కేస్ రిజిస్టర్ చేశారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడి కేసును పక్కదోవ పట్టించాలని చూడటం సరికాదని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X