భారత్ జాగృతి: 26న రౌండ్ టేబుల్ సమావేశం, ఎందకంటే…

అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ కవిత

ఈ నెల 26న రౌండ్ టేబుల్ సమావేశం….. బీసీ సంఘాలు, ప్రొఫెసర్లు, మేధావులు, రాజకీయ పార్టీలకు ఆహ్వానం

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు అంశంపై ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు, బీసీ సంఘాల నేతలను ఎమ్మెల్సీ కవిత స్వయంగా ఆహ్వానించారు. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించనున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం హైదర్ గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్పీకర్ ను కలిసి ఎమ్మెల్సీ కవిత వినతి పత్రం అందించారు.

అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ… బీసీల కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘ సంస్కర్త అయిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరామని వెల్లడించారు. గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామని, ఇప్పుడు అదే స్పూర్తితో పూలే విగ్రహం కోసం కూడా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11న పూలే జయంతి లోపు స్పీకర్, ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. అంటువంటి సమతామూర్తులను, సమానతత్వాన్ని ప్రబోదించినటువంటి మహనీయులను అసెంబ్లీకి వెళ్లే వాళ్లు చూస్తే చట్టాలు చేయడంలో, ప్రజలకు న్యాయం కల్పించడంలో స్పూర్తి ప్రదాతగా ఉంటారని చెప్పారు.

ఏప్రిల్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల మద్ధతును తీసుకొని వివిధ కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన బలహీన వర్గాల సమూహానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలన్న చర్చ దేశమంతా జరుగుతోందని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, బీసీ జన గణన చేపడుతామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇచ్చాయన్నారు.

భారత్ జాగృతి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. బతుకమ్మ పండగకు రాష్ట్ర పండగ హోదా ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనే డిమాండ్ చేసి సాధించుకున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాము అలుపెరగని పోరాటం చేసి సాధించామని వివరించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీపై యుద్ధం చేసి ఢిల్లీ స్థాయిలో ఉద్యమించి మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చామని, తద్వరా మహిళా రిజర్వేషన్లను సాధించుకోవడంలో భారత్ జాగృతి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

“ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి చిరస్మరణీయం. అణగారిన వర్గాల పట్ల, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు. సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ ఫూలే. మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, ఫూలేను తన గురువుగా ప్రకటించుకున్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభలలో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశ్యంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శం. గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇది మనందరికీ గర్వ కారణం.

అదే కోవలోనే సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరం. ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థల, బీసీ సంఘాల చిరకాల కోరిక. తెలంగాణ స్వరాష్ట్రమై సుందర భవిశ్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో సమానత్వ స్ఫూర్తి పతాక ‘మహాత్మా జ్యోతీరావు ఫూలే’ విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింప జేయగలదు. కావున వెనుకబడిన వర్గాల నుండి ఎదిగిన బిడ్డగా తమరి ఆధ్వర్యంలోనే ఈ మహత్కార్యం జరగాలని అకాంక్షిస్తున్నాను. అందుకై అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా తమరిని సవినయంగా కోరుతున్నాను.” అని వినతి పత్రంలో పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?? ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ? ఎమ్మెల్సీ కవిత స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం.. ఎమ్మెల్సీ కవిత

ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తాం. ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తులో రాజకీయాల కోసం, సoకుచిత మనస్తత్వంతో, ఈ మహా కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి! అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X