56వ రోజుకు చేరిన ఉద్యోగుల నిరసనలు
ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్ : గత 56 రోజులుగా ప్రశాంతంగా మధ్యాహ్నా భోజన విరామ సమయంలో జరిగే నిరసనలు రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమంగా మారనున్నట్లు జేఏసీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం : 1043/TE/A12/2024 ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Also Read-
ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా. ప్రమీల కేతావత్; కాంతం ప్రేమ్ కుమార్; బ్రహ్మానంద నాయుడు; డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర డా. రజిత; అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.