JNAFAUకి స్థలాన్ని కేటాయించొద్దు, లేదంటే నిరసనలు మరింత ఉధృతం చేస్తాం: ప్రొ ఆనంద్ పవర్

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించ్చొద్దని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనను కొనసాగించారు.

విశ్వవిద్యాలయంలోని సి.ఎస్.టి.డి భవనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సి.ఎస్.టి.డి డైరెక్టర్ ప్రొ. ఐ. ఆనంద్ పవార్ డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా కొనసాగతున్న ఈ నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read-

ఈ నిరసన కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ప్రొ. పుష్పా చక్రపాణి, డా. బొజు శ్రీనివాస్; డా. జి. దయాకర్; డా. యాకేష్ దైదా; డా. అవినాష్; డా. కిషోర్; డా. ప్రమీల కేతావత్; ఎన్సీ వేణు గోపాల్; జేఎసీ నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X