NARLA IS AN IDEAL FOR JOURNALISTS : N Venugopal Editor Veekshanam

Dr B R Ambedkar Open University ORGANISED NARLA MEMORIAL LECTURE

Hyderabad: N Venugopal Editor Veekshanam delivered the Twenty-Eight Narla Memorial Endowment lecture on ‘Telugu Journalism Prayaanam-Yakkadi Nunchi Ekkadi Daka’ at Dr.B.R.Ambedkar Open University Hyderabad on Friday.

N Venugopal said that the journalistic values of Narla’s generation do not exist in the current situation. It is not good for the society. He said Narla was the pioneer of the first generation of Telugu journalism and he stood as a pillar of journalistic values as long as he lived as a journalist. He also expressed concern that the profession has been commercialized in the name of modern journalism in the current situation and redefined the role of journalists.

Prof K Seetharama Rao, Vice-Chancellor, BRAOU who preside over the function, he said that the society needs journalists like Narla in the current situation. Narla’s family members are proud to present the books written and collected by him to the Ambedkar University Library as an example of values-based journalism. He also said that in Narla library, the university will be digitised all the books collected by Narla.

Prof Ghanta Chakrapani, Director (Academic) attended as guest of honor and introduced about the program. He stated that Narla is famous at the national level as a journalist with perseverance and values. Prof GHunti Ravinder, Director Materials & Publications introduced about the chief guest. Prof AVRN Reddy, Registrar; Prof E Sudharani, Director (GRCR&D); Prof Vaddanam Srinivas, Director EMR&RC; Dr LVK Reddy, Director LSSD; Director Materials & Publications were present in the program. Earlier the Chief Guest, Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of service associations offered rich floral tributes to Narla Portrait.

జర్నలిస్టులకి నార్లనే ఆదర్శం: వీక్షణం ఎడిటర్ ఎన్ వేణు గోపాల్

• అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నార్ల స్మారకోపన్యాసం

హైదరాబాద్: సమాజాన్ని కులమతాల పేరుతో విభజించడం భావ్యం కాదని, పాత్రికేయులుగా గొప్ప విలువలతో నార్ల జీవించారని వీక్షణం ఎడిటర్ శ్రీ. ఎన్. వేణు గోపాల్ అభిప్రాయబడ్డారు. డా బీ. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సటీ లో ప్రఖ్యాత జర్నలిస్ట్, సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు స్మృత్యర్థం ప్రతి ఏడాది నిర్వహించే నార్ల స్మారకోపాన్యాసంలో ప్రముఖ జర్నలిస్ట్, వీక్షణం సంపాదకులు శ్రీ .ఎన్. వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని “తెలుగు జర్నలిజం ప్రయాణం – ఎక్కడినుంచి ఎక్కడిదాకా” అనే అంశంపై ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ నార్ల తరం నాటి పాత్రికేయ విలువలు ప్రస్తుత పరిస్థితులలో లేవని, ఇది సమాజానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తపరిచారు. నార్ల తొలితరo తెలుగు జర్నలిజనికి ఆధ్యుడు అని, జర్నలిస్ట్ గా బ్రతికినంత కాలం పాత్రికేయ విలువలకు నిలువుటద్దంగా నిలిచారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధునిక జర్నలిజం పేరుతో వృత్తిని వ్యాపారమయం చేసారని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె సీతా రామారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో నార్ల లాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరం అన్నారు. విలువలతో కూడిన పాత్రికేయం ఆదర్శంగా నిలుస్తుందని, నార్ల కుటుంబ సభ్యులు ఆయన రాసిన, సేకరించిన పుస్తకాలను అంబేద్కర్ విశ్వవిద్యాలయ లైబ్రరీకి అందించడం గర్వకారణంగా పేర్కొన్నారు. నార్ల లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలను త్వరలోనే డిజిటలైజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయం అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి కార్యక్రమ ఆవశ్యకత గురించి వివరించారు. నార్ల పట్టుదల, విలువలతో కూడిన పాత్రికేయులుగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచారు అని పేర్కొన్నారు. ప్రధాన వక్త శ్రీ ఎన్. వేణు గోపాల్ గురించి ప్రో. గుంటి రవి సభకు పరిచయం చేశారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. ఎ.వి.ఆర్.ఎన్ రెడ్డి; జి.ఆర్.సీ.ఆర్ & డీ డైరెక్టర్, ప్రొ. ఇ. సుధా రాణి; ఈ.ఎం.ఆర్ & ఆర్.సీ డైరెక్టర్, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని నార్లగారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X