
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అభివృద్ధికి తాజా బడ్జెట్లో నిధులు కేటాయించనందకు వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి, యూనివర్సిటీ అన్ని విభాగాల డైరెక్టర్లు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డా. బి. ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం (BRIIDGE) భవన నిర్మాణం కోసం రూ. 100 కోట్లు, పలు అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్ల గ్రాంటును, అదేవిధంగా ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ. 24.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

సోమవారం యూనివర్సిటీ లో నిర్వహించిన అన్ని విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, ఐఏఎస్ లకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read-
ఈ నిధులను విద్యార్ధులకు ఉపయోగపడేలా మౌళిక వసతుల కల్పనకు ఉపయోగించనున్నట్లు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ ప్రొ. పుష్పా చక్రపాణి, డైరెక్టర్లు, డీన్లు ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రబీంద్ర నాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. శ్రీదేవి, ప్రొ. వెంకట రమణ, ప్రొ. భోజు శ్రీనివాస్, ప్రొ. చంద్రకళ, ప్రొ. రాణి రజిత మాధురి, డా. వై. వెంకటేశ్వర్లు, డా. ఏ. రమా దేవి, ఫైనాన్స్ ఆఫీసర్ వేణు గోపాల్ తదితరులు ఉన్నారు.
