హైదరాబాద్ : తూనికలు కొలతలలో అవక తవకలకు పాల్పడితే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ.ఓ.డి.బి (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం పేరుతో వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం మధ్యాహ్నం డా. బి. ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తూనికలు కొలతల శాఖా సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల శాఖా మరియు తూనికలు కొలతల శాఖా ముఖ్య కార్యదర్శి డి.యస్.చౌహన్, తూనికలు కొలతల శాఖా సహాయ కార్యదర్శి ప్రియాంక,అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్లు ఇందులో పాల్గొన్నారు.
Also Read-
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తూనికలు కొలతల శాఖపై వినియోగదారులలో చైతన్యం పెంపొందించాడంతో పాటు ప్రజలు మోసపోకుండాఉండేలా తరచు తనిఖీలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పెట్రోల్ బంక్ లతో పాటు వేయింగ్ మిషన్ లపై నిఘా పెంచాలని ఆయన సూచించారు. తద్వారా ప్రజలను మోసాల బారిన పడకుండా చూడొచ్చన్నారు. జిల్లాల వారిగా తరచు సమీక్షలు నిర్వహించాలని ఆయన చెప్పారు.తూనికలు కొలతల శాఖాలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అదే సమయంలో శాఖా పరంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి కృష్జి చేస్తామన్నారు.
హాజరైన నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్న పౌరసరఫరాలు మరియు తూనికలు కొలతల శాఖా ప్రత్యేక కార్యదర్శి డి. యస్. చౌహన్, తూనికలు కొలతల శాఖా సహాయ కార్యదర్శి ప్రియాంకాతెలంగాణా అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ తదితరులు.