Pravalika Suicide Case: प्रवलिका आत्महत्या सरकार की हत्या है: न्यायमूर्ति चंद्रकुमार

हैदराबाद: जस्टिस चंद्रकुमार ने कहा कि प्रवलिका की आत्महत्या के लिए तेलंगाना सरकार को जिम्मेदार ठहराया जाना चाहिए। प्रवलिका की आत्महत्या के बारे में दुष्प्रचार कर रही बीआरएस सरकार को हटाना चाहिए। तेलंगाना राज्य लोकतांत्रिक मंच के तत्वावधान में बुधवार को सोमाजीगुड़ा प्रेस क्लब में एक गोलमेज बैठक आयोजित की गई।

इस मौके पर चंद्रकुमार ने सबोधित किया। उन्होंने कहा कि जल, निधि और नौकरियों के लिए संघर्ष करने वालों को नौकरियां नहीं मिल रही हैं। उन्होंने कहा कि केसीआर ने सत्ता में आने के बाद हर घर में एक नौकरी देने का आश्वासन दिया था। मगर केसीआर के घर के पांच सदस्यों को नौकरियां दी गई। पिछले चुनाव घोषणापत्र में बेरोजगारी बेरोजगार भत्ता देने का वादा किया गया था। मगर केसीआर ने बेरोजगार युवकों को धोखा दिया।

चंद्रशेखर ने कहा कि 2014 में जहां 1.92 लाख नौकरियां खाली थीं, वहीं 2018 तक यह संख्या बढ़कर 2.70 लाख तक पहुंच गई है। टीएसपीएससी नौकरी नियुक्ति मुद्दे में विफल रही है। प्रवलिका ने चार परीक्षा के लिए आवेदन किया था। मंत्री केटीआर कैसे कह सकते है कि प्रवलिका ने आवेदन नहीं किया। दलितों को दलित बंधु देने में 180 साल लगेंगे। केसीआर ने तेलंगाना के लोगों को दो बार धोखा दे चुके हैं। तीसरी बार बीआरएस को मौका नहीं दिया जाना चाहिए।

संबंधित खबर:

प्रधानमंत्री मोदी ने भी देश की जनता को धोखा दे रहे हैं। अकेले रेलवे में लाखों नौकरियां खाली हैं। उन्होंने मोदी पर अदानी और अंबानी की संपत्ति बढ़ाने के लिए काम करने का आरोप लगाया। उन्होंने कहा कि देश में महिलाओं के लिए कोई सुरक्षा नहीं है। मणिपुर में महिलाओं को कपड़े उतार कर घुमाया गया। उनकी सूद लेने वाला कोई नहीं है। लोगों को धोखा देने वाली बीजेपी और बीआरएस को बाहर करना चाहिए और उनका समर्थन करने वाली एमआईएम को भी नहीं छोड़ना चाहिए।

ప్రవళిక ఆత్మహత్య సర్కార్ హత్యే: జస్టిస్​ చంద్రకుమార్

హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్యపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రావడంలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారని, వాళ్ల ఇంటికి మాత్రమే ఐదు ఉద్యోగాలు వచ్చాయన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా మోసం చేశారన్నారు.

2014లో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండగా, 2018 నాటికి ఆ సంఖ్య 2.70 లక్షలకు చేరిందన్నారు. ఉద్యోగాల నియామకాల విషయంలో టీఎస్ పీఎస్సీ ఫెయిల్ అయిందన్నారు. ప్రవళిక మూడు పరీక్షలకు దరఖాస్తు చేస్తే అసలు ఏ పరీక్షకు దరఖాస్తు చేయలేదని మంత్రి కేటీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. దళితులకు దళితబంధు ఇవ్వాలంటే 180 ఏండ్లు పడుతుందన్నారు. కేసీఆర్ చేతిలో ఇప్పటికే రెండు సార్లు మోసపోయామని, మరోసారి మోసపోవద్దన్నారు. ప్రధాని మోదీ కూడా మోసం చేస్తున్నారన్నారు.

ఒక్క రైల్వేలోనే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచేందుకే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మహిళలకు భద్రతలేకుండా పోయిందని, మణిపూర్​లో బట్టలు లేకుండా మహిళలను తిప్పితే కూడా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్​లను తరిమికొట్టాలని, వారికి మద్దతుగా ఉన్న ఎంఐఎంనూ వదలొద్దని అన్నారు.

సీపీఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు రమ మాట్లాడుతూ, ప్రవళిక నిజంగా ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకుంటే అందుకు ఆధారాలు ఎందుకు చూపలేదన్నారు. పీవోడబ్ల్యూ నేషనల్ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకుందని నాటకం ఆడుతున్నారన్నారు. ప్రవళిక ఆత్మహత్య సంఘటన మరువక ముందే పెద్దపల్లిలో మరో నిరుద్యోగి రహ్మత్ సూసైడ్​ చేసుకున్నాడని, మరి కేటీఆర్ దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయేషా కేసులో సత్యంబాబు లాగా ఇప్పుడు శివరామ్​​ను బలి చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ ​సర్వీస్ ​కమిషన్​.. ప్రగతి భవన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా మారిందన్నారు. 9 ఏండ్ల తరువాత నిర్వహించిన నోటిఫికేషన్​లో 150 ప్రశ్నలకు 22 తప్పులు ఉన్నాయన్నారు. న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు(సీపీఐ ఎంల్) కె. గోవర్ధన్ మాట్లాడుతూ ప్రవళిక కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అలాగే పరీక్షలు రాసి మోసపోయిన నిరు ద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వాలని, టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేయాలన్నారు. సమావేశంలో ఇండియన్ నేషన్ మూవ్ మెంట్ కన్వీనర్ కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, సోగరాబేగం, ఎన్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X