हैदराबाद: देश की राजधानी दिल्ली स्थित ऐतिहासिक इमारत लाल किले में सोमवार शाम एक विस्फोट हुआ। यह विस्फोट लाल किला मेट्रो स्टेशन के पास भीड़भाड़ वाले इलाके में एक आई-20 कार से हुआ। इस हादसे में अब तक 13 लोगों की मौत हो चुकी है। कईं लोग घायल हुए हैं। मामले की जाँच कर रहे अधिकारियों ने हाल ही में कई अहम तथ्य उजागर किए हैं।
Also Read-
हाल ही में यह बात सामने आई है कि कार चालक उमर मोहम्मद उर्फ उमर नबी ने विभिन्न अवैध तरीकों से 20 लाख रुपये इकट्ठा किए थे। उस पैसे से उसने हरियाणा के नूंह मार्केट की एक दुकान से भारी मात्रा में अमोनियम नाइट्रेट खरीदा था। ज्ञातव्य है कि अमोनियम नाइट्रेट और ईंधन तेल युक्त विस्फोटक मिश्रण ही लाल किले में हुए विस्फोट का कारण बना था। 1989 में जम्मू-कश्मीर के पुलवामा में जन्मे उमर नबी फरीदाबाद स्थित अल फलाह विश्वविद्यालय में डॉक्टर हैं। इस सिलसिले में पुलिस ने विश्वविद्यालय के कई लोगों को हिरासत में लिया है और उनसे पूछताछ कर रही है।
Also Read-
लाल किले में हुए विस्फोट से कुछ घंटे पहले ही खुफिया एजेंसियों ने कश्मीर, हरियाणा और उत्तर प्रदेश में फैले जैश-ए-मोहम्मद और अंसार गजवत-उल-हिंद से जुड़े एक आतंकी मॉड्यूल का पर्दाफाश किया था और तीन डॉक्टरों समेत आठ लोगों को गिरफ्तार किया था। उन्होंने 2,900 किलोग्राम विस्फोटक भी जब्त किया था। पुलिस इस बात की जांच कर रही है कि उमर नबी को पैसे कैसे मिले। खबर है कि पूछताछ के लिए कई हवाला कारोबारियों को हिरासत में लिया गया है।
కారు డ్రైవర్‌కు హవాలా ద్వారా రూ.20 లక్షలు
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఐ-20 కారు నుంచి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారిస్తున్న అధికారులు తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఆ కారు నడిపిన డ్రైవర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ నబీ పలు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు సేకరించినట్టు తాజాగా బయటపడింది. ఆ డబ్బుతో హర్యానాలోని నుహ్ మార్కెట్‌లోని ఒక దుకాణం నుంచి పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ సేకరించాడు. అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె కలిగిన పేలుడు సమ్మేళనం ఎర్రకోట బ్లాస్ట్‌కు కారణమనే సంగతి తెలిసిందే. 1989లో జమ్మూ, కశ్మీర్‌లోని పుల్వామాలో జన్మించిన ఉమర్ నబీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ యూనివర్సిటీకి చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఎర్రకోటలో సంభవించిన ఈ పేలుడుకు కొన్ని గంటల ముందు నిఘా వర్గాలు కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌లకు సంబంధించిన టెర్రర్ మాడ్యూల్‌ను వెలికితీసి, ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అలాగే 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉమర్ నబీకి డబ్బులు ఎలా వచ్చాయని పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. విచారణ కోసం అనేక మంది హవాలా డీలర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. (ఏజెన్సీలు)
