हैदराबाद: इस महीने की 4 तारीख को सचिवालय में सीएम केसीआर की अध्यक्षता में कैबिनेट बैठक आयोजित करने का कार्यक्रम तय किया गया है। क्या केसीआर फिर से सत्ता में वापस आने की उम्मीद से कैबिनेट की आयोजित कर रहे हैं? या फिर हार मानकर त्यागपत्र देने का फैसला लेने वाले हैं? इस पर चर्चा शुरू हो गई है। बीआरएस के नेता खुलेआम कह रहे हैं कि विधानसभा के नतीजे चाहे जो भी आएं उन्हें इसके तैयार रहना है। ज्यादातर सर्वेक्षण संगठनों ने एग्जिट पोल के नतीजे कांग्रेस के पक्ष में दिए हैं। हालांकि, केसीआर ने उम्मीद नहीं छोड़ी है। उन्हें भरोसा है कि वे सत्ता में आएंगे।
ज्यादातर संगठनों के एग्जिट पोल के नतीजे कांग्रेस के पक्ष में आने से बीआरएस पार्टी में निराशा छा गई है। पार्टी के वरिष्ठ नेता एग्जिट पोल के नतीजों को पार्टी नेता पचा नहीं पा रहे हैं। पार्टी नेताओं को लगने लगा कि वे कितनी भी मेहनत कर लें, कोई फायदा नहीं होगा। चर्चा है कि अधिकांश मंत्री, विधायक और पूरा कैडर हार रहा है। प्रदेश स्तर के नेताओं समेत मंत्रियों, जिलों के प्रभारियों और प्रत्याशियों के बीच चल रही यह बात केटीआर तक पहुंच गई है। उसी के तहत एक प्रेस वार्ता के माध्यम से उन्हें साहस दिया है। उन्होंने टिप्पणी की कि हम जीत रहे हैं, एग्जिट पोल के सटीक नतीजे नहीं है। मतगणना के दिन जश्न मनाते है।
मतदान के बाद प्रगति भवन पहुंचे सीएम केसीआर ने निर्वाचन क्षेत्रों का पोस्टमॉर्टम भी शुरू किया। पार्टी के लिए काम करने वाले विभिन्न सर्वे संगठनों की रिपोर्ट का बारीकी से अध्ययन किया। मंत्री केटीआर और हरीश राव ने भी चर्चा की और क्षेत्र की स्थिति के बारे में बताया। मालूम हो कि उन्होंने उम्मीद जताई है कि वह हिसाब-किताब कर जादुई आंकड़ा पार करने में सफल रहेंगे। कैडर में निराशा देखने के बाद, केसीआर ने घोषणा की कि वह इस महीने की 4 तारीख को कैबिनेट बैठक करेंगे ताकि यह संदेश दिया जा सके कि हम फिर से जीत रहे हैं।
संबंधित खबर:
वोटों की गिनती रविवार सुबह 8 बजे शुरू होगी, लेकिन रुझान दोपहर के आसपास सामने आ जाएगा। इससे साफ हो जाएगा कि कौन सी पार्टी कितनी सीटों पर आगे चल रही है। चूंकि पूरे नतीजे दोपहर बाद आ रहे हैं। इसलिए केसीआर ने कैबिनेट बैठक की तारीख की घोषणा करने के लिए तब तक इंतजार नहीं किया। भले ही केसीआर इस फैसले पर पहुंच गए हैं कि वह हार रहे हैं, लेकिन वह कैबिनेट बैठक के लिए तैयार हैं। चर्चा शुरू हुई कि आखिरी कैबिनेट बैठक यह संकेत देने के लिए हो रही है कि हम जनता के फैसले को समझते हैं और सम्मानपूर्वक पीछे हटते हैं।
संविधान विशेषज्ञों का मानना है कि जो भी पार्टी सत्ता में आए, मौजूदा विधानसभा को भंग करना जरूरी है। मौजूदा विधानसभा का कार्यकाल 16 जनवरी तक है। साथ ही स्पष्ट किया कि यदि विधानसभा में नवनिर्वाचित सदस्यों का चुनाव करना है तो विधानसभा का कार्यकाल समाप्त हो जाना चाहिए या वर्तमान विधानसभा को भंग कर देना चाहिए। अगर सीएम इस्तीफा देंगे तो सिर्फ कैबिनेट भंग होगी, लेकिन विधानसभा लाइव रहेगी। उन्होंने कहा कि संविधान के प्रावधानों के मुताबिक विधानसभा भंग करने का अधिकार केवल कैबिनेट को है। इसलिए केसीआर की अध्यक्षता में कैबिनेट की बैठक आयोजित करना जरूरी है।
कानूनी प्रावधानों के मुताबिक, कैबिनेट इस महीने की 4 तारीख को बैठक करेगी और विधानसभा भंग करने का प्रस्ताव पारित कर राज्यपाल की मंजूरी के लिए राजभवन को भेजेगी। संवैधानिक विशेषज्ञों ने बताया कि चाहे बीआरएस पार्टी जीते या हारे, केसीआर को सीएम पद से इस्तीफा तो देना ही है। अगर बीआरएस दोबारा जीतती है तो उन्हें राज्यपाल से मिलकर सीएम पद से इस्तीफा देना होगा और पत्र देकर नई सरकार बनाने की अनुमति मांगनी होगी। मुख्यमंत्री के साथ-साथ शपथ लेने वाले मंत्रियों के साथ आयोजित कैबिनेट बैठक को ही मान्यता दी जाती है।
यदि बीआरएस हार जाती है, तो केसीआर को इस्तीफा देना होगा ताकि जीतने वाली पार्टी के नेतृत्व में एक नई सरकार बनाई जा सके। भले ही नतीजे घोषित होने के कुछ ही घंटों के भीतर उन्हें इस्तीफा देना होगा, लेकिन विधानसभा भंग होने का मुद्दा भी इसी में फंस है। नतीजतन, अगले दिन विधानसभा भंग करने और एक साथ सीएम पद से इस्तीफा देने का सर्वसम्मति से फैसला लिया जाएगा।
హైదరాబాద్: ఈనెల 4వ తేదీన సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో దీనిని నిర్వహిస్తున్నారా? లేక ముందే ఓటమిని అంగీకరించి పదవి నుంచి తప్పుకునేందుకు ఇందులో నిర్ణయం తీసుకోబోతున్నారా? అనే చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఫలితాలు ఎలా వచ్చినా అందుకు సిద్ధపడక తప్పదని గులాబీ వర్గాలు ఓపెన్‌గానే చెబుతున్నాయి. మెజార్టీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయి. అయినా కేసీఆర్ మాత్రం ఆశలు వదులుకోలేదు. తామే అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్నట్టు సమాచారం.
చాలా వరకు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ పార్టీలో నైరాశ్యం నెలకొన్నది. పార్టీ పెద్దలు సైగం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత కష్టపడినా ప్రయోజనం లేకపోయిందనే ఆవేదన పార్టీ నేతల్లో మొదలైంది. మెజార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కేడర్ మొత్తం ఓడిపోతున్నామట గదా అన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర స్థాయి నేతలతో సహా జిల్లాల్లోని మంత్రులు, ఇన్‌చార్జిలు, అభ్యర్థుల్లో జరుగుతున్న ఈ టాక్ కేటీఆర్ వరకూ చేరింది. అందులో భాగంగానే వారికి ధైర్యం కల్పించేందుకు ప్రెస్‌మీట్ ద్వారా భరోసా ఇచ్చారు. గెలుస్తున్నది మనమే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ కాదని, కౌంటింగ్ రోజున సంబురాలు చేసుకుందామంటూ వ్యాఖ్యానించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ సైతం నియోజకవర్గాలవారీగా పోస్టుమార్టం మొదలుపెట్టారు. పార్టీ కోసం పనిచేసిన పలు సర్వే సంస్థల రిపోర్టులను నిశితంగా అధ్యయనం చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సైతం చర్చించి ఫీల్డ్ పరిస్థితిని వివరించారు. లెక్కలు వేసుకుని మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేడర్‌లోని నిరుత్సాహాన్ని గమనించిన కేసీఆర్ మళ్లీ మనమే గెలుస్తున్నామనే మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ నెల 4న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్టు ప్రకటన చేశారన్న ప్రచారం జరుగుతున్నది.
ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకే ప్రారంభమైనా దాదాపు మధ్యాహ్నం సమయానికి ట్రెండ్ వెల్లడవుతుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నదో తేలిపోతుంది. పూర్తి స్థాయి ఫలితాలు మధ్యాహ్నం తర్వాత రానుండడంతో అప్పటివరకూ కేసీఆర్ ఎదురుచూడకండా కేబినెట్ సమావేశం తేదీని ప్రకటించడం అనుమనాలకు తావిచ్చింది. ఓడిపోతున్నామని కేసీఆర్ సైతం ఒక నిర్ణయానికి వచ్చినా కేబినెట్ సమావేశానికి సిద్దమయ్యారు. ప్రజా తీర్పును అర్థం చేసుకుని, గౌరవంగా తప్పుకుంటున్నట్టున్నామనే సంకేతాలు ఇచ్చేందుకే చివరి కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారేమోనని టాక్ మొదలైంది.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీని రద్దు చేయడం తప్పనిసరని రాజ్యంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16 వరకు ఉన్నది. ఈ లోపు కొత్తగా ఎన్నికైన సభ్యులు సభలో కొలువు తీరాలంటే అసెంబ్లీ గడువు ముగిసిపోవాలి.. లేదా ప్రస్తుత సభను రద్దు చేయాలి అని వివరించారు. సీఎం రాజీనామా చేస్తే కేవలం మంత్రివర్గం మాత్రమే రద్దవుతుంది గానీ అసెంబ్లీ లైవ్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అసెంబ్లీని రద్దు చేసే పవర్ కేవలం కేబినెట్‌కు మాత్రమే ఉన్నందున కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహించడం తప్పనిసరని తెలిపారు.
ఈ లీగల్ నిబంధనల మేరకే ఈ నెల 4న కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానం చేసి దాన్ని గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపనున్నట్టు సచివాలయ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఓడినా కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదని రాజ్యాంగ నిపుణులు వివరించారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే గవర్నర్‌ను కలిసి, సీఎం పదవికి రాజీనామా సమర్పించి, కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సీఎంతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారితో నిర్వహించే సమావేశమే కేబినెట్ భేటీగా గుర్తింపు పొందుతుంది.
ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోతే గెలుపొందిన పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా కేసీఆర్ రాజీనామా చేయక తప్పదు. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే రాజీనామా చేయాల్సి ఉన్నా అసెంబ్లీ రద్దు వ్యవహారం సైతం ముడిపడి ఉన్నది. దీంతో మరుసటి రోజున ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని ఏకకాలంలో అటు శాసనసభ రద్దు, ఇటు సీఎం పదవికి రాజీనామా ఒకేసారి జరగనున్నాయి. (ఏజెన్సీలు)