Monda Market Gold Theft Case: मोंडा मार्केट सोना चोरी मामले में प्रगति, महाराष्ट्र का निकला चोर गिरोह

हैदराबाद: सिकंदराबाद के मोंडा मार्केट पान बाजार में सोने के जेवरात गलाने की दुकान में हुई चोरी के मामले में पुलिस ने प्रगति की है> मुंबई पुलिस द्वारा इस चोरी के लिए महाराष्ट्र के ठाणे के गिरोह के जिम्मेदार होने की पुष्टि की है। इसके बाद स्थानीय पुलिस की टीमें मुंबई गईं।

पुलिस के अनुसार, मुंबई से आठ सदस्यों का एक गिरोह इस महीने की 24 तारीख को शहर आया था और पैटनी सेंटर में दिल्ली लॉज में रुका था। पान बाजार की उस ज्वैलरी मेल्टिंग शॉप में जाकर तीन दिनों तक रेकी की। पुष्टि हुई कि दुकान में कोई मालिक नहीं है।

इसी क्रम में शनिवार को उस गिरोह के छह सदस्य आईटी अधिकारी बनकर दुकान में घुस गये। दो अन्य दुकान के सामने पहरा देlते रहे। उन्होंने उचित दस्तावेज नहीं होने का दावा करते हुए 1700 ग्राम सोने के बिस्कुट लेकर निकले और एक ऑटो में बैठकर कुकटपल्ली भाग गए।

संबंधित खबर:

पुलिस जांच में पता चला कि ये सभी वहां से बस के जरिए मुंबई गए। स्थानीय पुलिस ने मुंबई पुलिस को डकैती के पैटर्न के बारे में बताया। महाराष्ट्र पुलिस ने पुष्टि की कि यह ठाणे गिरोह का काम है। बताया जा रहा है कि पुलिस की टीमों ने मुंबई जाकर आरोपी की तलाश शुरू कर दी है।

Monda Market Gold Theft Case: మోండా మార్కెట్​ బంగారం చోరీ కేసులో పురోగతి

హైదరాబాద్: సికింద్రాబాద్ మొండా మార్కెట్ పాన్ బజార్​లోని బంగారు నగల మెల్టింగ్ షాప్​లో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ చోరీకి పాల్పడింది మహారాష్ట్రలోని థానేకు చెందిన గ్యాంగ్ గా ముంబై పోలీసులు నిర్ధారించడంతో స్థానిక పోలీసు బృందాలు ముంబైకి బయళ్దేరి వెళ్లాయి.

పోలీసుల వివరాల ప్రకారం ముంబై నుంచి ఎనిమిది మంది సభ్యుల ముఠా ఈ నెల 24న సిటీకి వచ్చి ప్యాట్నీ సెంటర్​లోని ఢిల్లీ లాడ్జ్ లో బసచేశారు. పాన్​బజార్​లోని ఆ నగల మెల్టింగ్ షాపునకు వెళ్లి మూడ్రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. షాప్​లో యజమాని లేడని నిర్ధారించుకున్నారు.

దీంతో శనివారం ఆ గ్యాంగ్​లోని ఆరుగురు సభ్యులు ఐటీ అధికారులమంటూ షాప్ లోపలికి ప్రవేశించారు. మిగతా ఇద్దరు షాపు ముందు కాపలా ఉన్నారు. సోదాల పేరు చెప్పి సరైన డాక్యుమెంట్లు లేవంటూ 1700 గ్రాముల బంగారు బిస్కెట్లు తీసుకొని బయటకువచ్చి అంతా కలిసి ఆటోలో కూకట్​పల్లికి పారిపోయారు.

అక్కడ నుంచి వారంతా బస్సులో ముంబైకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దోపిడీ విధానాన్ని స్థానిక పోలీసులు ముంబై పోలీసులకు వివరించగా ఇది థానే గ్యాంగ్ పనిగా వారు నిర్ధారించారు. దీంతో పోలీసు బృందాలు ముంబైకి వెళ్లి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X