ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంతో పసిప్రాణం బలి: టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

Hyderabad:

👉 జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిన్న ఉదయం చిన్నారి ఇందు మిస్సింగ్
👉 కనపడకుండా పోయిన చిన్నారి ఇందు ఈరోజు ఉదయం చెరువులో శవమై తేలిన వైనం
👉 24 గంటలు గడిచినా చర్యలు శూన్యం
👉 పోలీసుల, ప్రభుత్వం నిర్లక్ష్యంతో పసిపాప ప్రాణం బలి
👉 జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని 3 వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న పేద కుటుంబం
👉 నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
👉 ఫిర్యాదు చేసినా కానీ తూతూ మంత్రంగా చర్యలు
👉 దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, రాష్ట్రంలో కూడా ఇటీవల ఎన్నో సంఘటనలు జరిగినా పట్టించుకోని ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం 👉 ఈరోజు దమ్మాయిగూడ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన
👉 ఆందోళనలో పాల్గొన్న టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

ఈ ఆందోళనలో హరి వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ…

“నిత్యం ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, దమ్మాయిగూడ, జవహర్ నగర్ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, మాదకద్రవ్యాలకు స్థానిక యువకులు అలవాటు పడుతున్నారని, కనీసం వాటిపై ప్రభుత్వం గానీ, పోలీసులు గాని నిఘా పెట్టడం లేదని, ఎన్నో కుటుంబాలు చిద్రమైపోతున్నాయని, ముఖ్యమంత్రి బి ఆర్ఎస్ పేరుతో ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాడని, పాలన గాలికి వదిలేసారని, స్థానిక మంత్రి ఇటువంటి సంఘటనలను కనీసం పట్టించుకోరని, అమాయకులైన పేద కుటుంబాల పిల్లలు ఇలాంటి సంఘటనలకు బలి అవుతున్నారని, చిన్నారి అదృశ్యం అయి 24 గంటలు గడిచినా ప్రభుత్వ నుంచి గాని పోలీసుల నుంచి గాని కనీసం స్పందన లేదని ,వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ కుటుంబం రోడ్డు పాలైందని, చిన్నారి ఇందు విగత జీవి అయిందని, వెంటనే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా పెట్టి, ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులపై ఉందని, అన్యాయం జరిగిన ఆ కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలని, దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని, ఆ చిన్నారి ఇందు కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ కుటుంబానికి వెంటనే 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, ఆ చిన్నారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు.”

ఈ కార్యక్రమంలో హరివర్ధన్ రెడ్డి గారితో పాటు జవహర్ నగర్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాళ్ళు అనంతలక్ష్మి గారు శోభారాణి గారు, నాయకులు ఏనుగు సంజీవరెడ్డి గారు, కొత్తకొండ వేణు గారు, సామల శ్రీనివాస్ రెడ్డి గారు, సుమేష్ గారు, మాట్ల శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

గురువారం ఉదయం 9.20 గంటల సమయంలో తండ్రి స్కూల్ వద్ద డ్రాప్ చేసిన మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా చెరువు వద్దకు వెళ్లగా చిన్నారి శవం నీటిపై తేలుతూ కనిపించింది. వెంటనే చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. డెడ్ బాడీని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కనీసం హాస్పిటల్లో సైతం తమ కూతురు మృతదేహాన్ని చూపించలేదని పేరెంట్స్ కన్నీరు పెట్టుకుంటున్నారు.

గురువారం ఉదయం 9.20 గంటల సమయంలో బాలికను తండ్రి స్కూల్ వద్ద డ్రాప్ చేశాడు. అనంతరం చిన్నారి పార్కుకు వెళ్దామని స్నేహితులతో చెప్పగా వారు నిరాకరించారు. దీంతో చిన్నారి క్లాస్ రూంలోనే బ్యాగు పెట్టి స్కూల్ నుంచి బయటకు వచ్చింది. ఉదయం 10.20 గంటలకు టీచర్ అటెండెన్స్ తీసుకోగా బాలిక మిస్సైనట్లు గుర్తించారు. బ్యాగు క్లాస్ రూంలోనే ఉండటంతో టీచర్లు స్కూల్ పరిసరాల్లో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు జవహర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.

బాలిక మిస్సైన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న జవహర్ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. స్కూల్ నుంచి బాలిక వెళ్లిన రూట్ లో సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలిక చదువుతున్న పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు కిలోమీటర్ దూరంలో ఉంది. చిన్నారి చెరువు వైపు ఎందుకు వెళ్లిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

స్కూలు నుంచి బయలు దేరిన బాలిక అసలు చెరువు వద్దకు ఎందుకు వెళ్లిందన్నది మిస్టరీగా మారింది. బాలిక శరీరంపై కత్తి గాయాలుండటంతో కుటుంబసభ్యులు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు సాయంత్రం వరకు మిస్సింగ్ కేసు నమోదుచేయలేదని అంటున్నారు. కంప్లైంట్ అందిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టుంటే చిన్నారి ఆచూకీ దొరికేదని తల్లిదండ్రులు అంటున్నారు.

బాలిక మిస్సైన సమయంలో చెరువు వద్ద నలుగురు వ్యక్తులు గంజాయి తాగుతూ కనిపించారని బంధువులు చెబుతున్నారు. దానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు ఇచ్చినట్లు తెలసింది. మరోవైపు దమ్మాయిగూడ చెరువు ప్రాంతం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి తాగడం నిత్యకృత్యంగా మారిందని అంటున్నారు. జవహర్ నగర్ పీఎస్లో ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X