హైదరాబాద్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి,వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా సి.ఎం. మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు . ఈ విభాగానికి కావాల్సిన నిధులు,వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సయిజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రూ. 2 లక్షల మేరకు రుణ మాఫీ పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి : సి.ఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ పై నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి డా.బీఆర్.అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్,సహకార,హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రామ కృష్ణ రావు, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
దాదాపు మూడు గంటల పాటుజరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖా, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నేటి నుండే రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని ఉన్నతాధికారులను సి.ఎం. ఆదేశించారు.
ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి నిర్వహణ
హైదరాబాద్: ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ప్రజావాణిగా పిలవాలని సి.ఎం ఆదేశించారు. ఈ ప్రజావాణి ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని,ప్రజల సౌకర్యార్థం తీగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Capt Uttam Kumar Reddy, Minister for Irrigation & Civil Supplies
Hyderabad: Capt Uttam Kumar Reddy, Minister for Irrigation & Civil Supplies, held a review of Irrigation department in Jal Soudha Bhavan and said that the Congress government would follow the points in Manifesto regarding Irrigation-
Immediate inquiry would be held regarding sinking of pillars of Medigadda barrage. All aspects of Kaleshwaram project would be examined.
We would fight for the rightful share of Krishna water for Telangana.
Would pursue with Central government for achieving National project status for Palamuru Ranga Reddy project.
4.Pending projects wherein more ayacut can be given water at less cost would be given priority and completed on fast track basis.
Baba saheb Ambedkar pranahita- Chevella project would be taken up.
Necessity steps would be taken up to improve the ayacut under 40,000 cheruvulu
G. Niranjan, TPCC Senior Vice President & Chairman, Election Commission Coordination committee
State BJP President G. Kishan Reddy’s comments criticizing the Congress raise suspicions that he has lost his mental balance.
He criticized the Congress saying that people are holding their heads for electing the Congress to power.
For the past three years every BJP leader including Modi has been clamoring to come to power, but the people of Telangana have limited them to single digit.
Not knowing where to put his head, Kishan Reddy is talking as that people are holding their heads for electing the Congress to power.
People are laughing after hearing his words.
Elections were held on November 30, results declared on December 3, from the day of swearing-in on December 7, the Congress government under Revanth Reddy, broke the Pragathi Bhavan boundry wall and held the praja durbar from the next day but also implemented two of the six guarantees, free bus transport for women and raised Arogya sree limit to 10 lakhs. It is not proper for Kishan Reddy to criticise llike a blind man.
There are only 8 BJP MLAs but they are unable to decide their Legislative Assembly party leader. They are actually holding their heads.
Congress has always been against Majlis and its policies.
Though the Majlis leaders scolded the Congress leaders with itchy mouths, Akbaruddin Owaisi was appointed as the Protem Speaker in accordance with the traditions of the Assembly.
It is not appropriate for the BJP to criticise on this matter, blame the Congress, and throw away the dust.
Congress has condemned Akbar’s provocative remarks every time.
If Akbaruddin is disqualified as protem Speaker , the Modi who also makes communal comments is also disqualified for the post of Prime Minister.
Even Raja Singh, who is habituated to chew poison against other religion also ineligible to take the oath, even if he has been elected.
కాంగ్రెస్ ను విమర్శిస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకు మతి స్థిమితం తప్పిందా అనే అనుమానం కలిగిస్తోంది.
కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తలలు పట్టుకుంటున్నారని ఆయన కాంగ్రేస్ ను విమర్శించారు.
గత మూడేళ్లుగా మోడీ నుండి ప్రతి బిజెపి నాయకు డి వరకు అధికారములోకి వస్తామని ఎంత ఊదర కొట్టినా, తెలంగాణ ప్రజలు వారిని సింగిల్ డిజిట్ కే పరిమితం చేశారు.
తన తలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తలలు పట్టుకుంటున్నారని బుద్ది మందగించి మాట్లాడు తున్నారు.
ఆయన మాటలు విని ప్రజలు నవ్వు కుంటున్నారు.
నవంబర్ 30 న ఎన్నికలు, డిసెంబర్ 3 న రిజల్ట్స్, డిసెంబర్ 7 న ప్రమాణ స్వీకారం చేసిన రోజున నే, ప్రగతి భవన్ ప్రహరీ గోడను బద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం, మరుసటి రోజు నుండి ప్రజా దర్బార్ నిర్వహించడమే కాక ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీ లను అమలు చేస్తూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల పెంచి ప్రజల మన్ననలు పొందుతుంటే, కిషన్ రెడ్డి గ్రుడ్డి వాడిలా విమర్శించడం తగదు.
ఉన్నది 8 బిజెపి శాసనసభ్యులే అయినా వారి శాసన సభా పక్ష నేతను నిర్ణయించుకో లేక నిజానికి వారి తలలు వారే పట్టుకుంటున్నారు.
మజ్లిస్ కు, మజ్లిస్ విధానాలకు కాంగ్రేస్ ఎప్పుడూ వ్యతిరేకమే.
నోటి దురదతో మజ్లిస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను తిడుతున్నా, అసెంబ్లీ సంప్రదాయాలకు అనుగుణంగా అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెమ్ స్పీకర్ గా నియమించడం జరిగింది.
బిజెపి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయడం, కాంగ్రెస్ ను తప్పు పట్టడం, దుమ్ము ఎత్తి పోయడము తగదు.
కాంగ్రెస్ అక్బర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రతి సారి ఖండించింది.
అక్బరుద్దీన్ ప్రొటెమ్ స్పీకర్ గా అనర్హుడు అయితే, మత పరమైన వ్యాఖ్యలు చేసే మోడీ కూడా ప్రధాన మంత్రి పదవికి అనర్హుడు.
ఒక మతము పై విషము చిమ్మ డమే పనిగా పెట్టుకున్న రాజా సింగ్ కూడా, ఎన్నిక కాబడ్డా, ప్రమాణ స్వీకారం చేయడానికి అనర్హుడు.