हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी रविवार को नागरकर्नूल जिले के दोमलपेंट स्थित एसएलबीसी सुरंग दुर्घटनाग्रस्त स्थल का दौरा किया। उन्होंने मंत्रियों और अधिकारियों से दुर्घटना और बचाव अभियान के बारे में विस्तृत जानकारी ली।
इसके बाद बाद में मीडिया से बात करते हुए सीएम ने कहा कि संयुक्त आंध्र प्रदेश में 4,000 क्यूसेक और 30 टीएमसी पानी को गुरुत्व पद्धिति से नलगोंडा और महबूबनगर जिलों की पेयजल जरूरतों को पूरा करने के लिए श्रीशैलम लेफ्ट बैंक नहर परियोजना 2005 शुरू की गई थी। तब से लेकर 2014 तक लगभग 32 किलोमीटर सुरंग का काम पूरा हो चुका है। तब माना गया कि तेलंगाना राज्य बनने के बाद यह परियोजना पूरी हो जाएगी और नलगोंडा में फ्लोराइड पीड़ितों की समस्या का समाधान हो जाएगा।
हालांकि, सत्ता में आई बीआरएस ने इस परियोजना को दरकिनार कर दिया। कम से कम बिजली का शुल्क भी नहीं चुकाया गया। इसके चलते बिजली की आपूर्ति बंद कर दी गई। इसके कारण 10 वर्षों से इस परियोजना का कार्य रुक गया है। कांग्रेस सरकार के सत्ता में आने के बाद इस परियोजना के निर्माण को गंभीरता से लिया और सुरंग बोरिंग की मरम्मत का काम शुरू किया। लेकिन यह अप्रत्याशित हादसा हो गया। मुख्यमंत्री ने कहा कि यह पाप निश्चित रूप से पूर्व सीएम केसीआर का है।
दुर्घटना में फंसे लोगों को बचाने के लिए 11 संगठन कार्य पर काम कर रहे हैं। इस अवसर पर सीएम ने मीडिया और विपक्ष से इस मुद्दे का राजनीतिकरण किये बिना इसे सुलझाने में सहयोग करने की अपील की। उन्होंने कहा कि मंत्री उत्तम कुमार रेड्डी और जुपल्ली कृष्णा राव दुर्घटना के एक घंटे के भीतर यहां पहुंच गये और स्थिति की समीक्षा कर रहे हैं।
सीएम ने आगे बताया कि अंदर बोर टीबीएम मशीन खराब हो गई और खुदाई के दौरान मिट्टी बाहर ले जाने वाली कन्वेयर बेल्ट भी काम नहीं कर रही है। इसके चलते पानी और कीचड़ के कारण मरम्मत कार्य में कुछ बाधा उत्पन्न हो रही है। अगले दो-तीन दिन में समस्या का समाधान हो जाएगा और कल तक कन्वेयर बेल्ट की मरम्मत कर दी जाएगी तथा अंदर गिरी मिट्टी को हटा दिया जाएगा। इस समस्या के समाधान के लिए यदि आवश्यक हुआ तो रोबोट का उपयोग किया जाएगा। साथ ही अधिकारियों को सुरंग निर्माण में रोबोट का उपयोग करने के निर्देश दिए गए हैं ताकि ऐसी दुर्घटनाएं दोबारा न हों।
Also Read-
SLBC ప్రమాదం పాపం కేసీఆర్ దే : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదస్థలానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రమాదంపై, రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 వేల క్యూసెక్కులు, 30 టీఎంసీల నీటిని గ్రావిటేషన్ పద్ధతిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల తాగు నీటి అవసరాలు తీర్చడానికి 2005లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారని తెలిపారు. అప్పటి నుంచి 2014 వరకు దాదాపు 32 కిమీల టన్నెల్ పూర్తి చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అభిప్రాయపడ్డామన్నారు.
కాని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, కనీసం విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోతే కరెంట్ సరఫరా నిలిపివేశారని అన్నారు. దీంతో 10 ఏళ్లు ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగ తీసుకొని టన్నెల్ బోర్ రిపైర్ పనులు క్లియర్ చేసి పనులు మొదలు పెట్టామని, కాని అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఖచ్చితంగా కేసీఆర్ దేనని సీఎం మండిపడ్డారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 11 సంస్థలు ఈ రెస్క్యూలో పని చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు, విపక్షాలు దీనిని రాజకీయం చేయకుండా సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు.
లోపల బోర్ టీబీఎం మిషన్ విరిగిపోయిందని, తవ్వకాలలో మట్టిని బయటికి చేరవేసే కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదన్నారు. నీరు, బురద ఉధృతంగా ఉండటం వలన రిపేర్ పనులకు కొంత ఆటంకం కలుగుతోందని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని, రేపటి లోగా కన్వేయర్ బెల్ట్ రిపైర్ చేసి లోపల కూలిన మట్టిని బయటికి తీస్తారని తెలియ జేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను వాడతామని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సొరంగ నిర్మాణంలో కూడా రోబోలను వాడమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. (ఏజెన్సీలు)