मुख्यमंत्री रेवंत रेड्डी ने तेलंगाना कुंभ मेला सम्मक्का-सारलम्मा जातरा की दी बधाई, बोले- यह “आत्म-सम्मान का प्रतीक है”

हैदराबाद : मुख्यमंत्री रेवंत रेड्डी ने लोगों को मेडारम सम्मक्का-सारलम्मा जातरा के मौके पर बधाई दी है, जिन्हें आत्म-सम्मान का प्रतीक माना जाता है। उन्होंने दुनिया के सबसे बड़े आदिवासी मेले और तेलंगाना कुंभ मेले के तौर पर प्रसिद्ध मेडारम महा जातरा को बड़े पैमाने पर मनाने की अपील की। ​​उन्होंने कहा कि चार दिन का यह त्योहार आदिवासी और आदिवासी रीति-रिवाजों के साथ वन देवताओं के त्योहार के तौर पर मनाया जाना चाहिए। उन्होंने कहा कि तेलंगाना सरकार ने जातरा के लिए बड़े पैमाने पर इंतज़ाम किए हैं। इस जातरा में डेढ़ करोड़ से ज़्यादा भक्तों के आने की उम्मीद है।

मुख्यमंत्री ने याद दिलाया कि सार्वजनिक सरकार ने मेडारम मंदिर को इतिहास में जगह बनाने के लिए पुनर्निर्माण किया है और पहले की तरह भारी धन आवंटित किया है। 250 करोड़ की लागत से सम्मक्का, सारलम्मा, गोविंदराजू और पगीडिद्दा राजू गद्दों का निर्माण किया गया। सम्मक्का सारलम्मा गद्देला के परिसर को आदिवासी और आदिवासी रीति-रिवाजों और परंपराओं के अनुसार मॉडर्न बनाया गया है और परिसर के सभी दिशाओं में तोरण बनाए गए हैं। उन्होंने कहा कि उनकी सरकार ने सड़कों और स्थायी इंफ्रास्ट्रक्चर के निर्माण को प्राथमिकता दी है ताकि मंदिर में लगातार आने वाले लाखों भक्तों को कोई परेशानी न हो। उन्होंने कहा कि सरकार ने आदिवासी सांस्कृतिक परंपराओं को बचाने और आदिवासियों के रीति-रिवाजों को बचाने की जिम्मेदारी ली है।

यह भी पढ़ें-

తెలంగాణా కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్ : ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయేలా మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించినట్లు గుర్తు చేశారు. లక్షలాదిగా నిరంతరం మేడారం తరలివస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేందుకు, ఆదివాసీల ఆచారాలను పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని అన్నారు.

మేడారం తల్లుల స్పూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తల్లుల చెంత ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించిందని అన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని అన్నారు.

నాలుగు రోజుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే అంచనాలు ఉండటంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి సీఎం ఫోన్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు.

గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వన దేవతలను దర్శనం చేసుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించాలని అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా భక్తులు సహకరించాలని కోరారు. పోలీసు విభాగంతో పాటు అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా మహా జాతర వైభవంగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం అన్ని విభాగాల అధికారులు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా భక్తులకు అందుబాటులో ఉండాలని అప్రమత్తం చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X