हैदराबाद : पुलिस थानों में समय-समय पर अनेक शिकायतें मिलती रहती है। कुछ शिकायतें अजीबोगरीब भी होती हैं। ऐसी ही एक अजीबोगरीब शिकायत हैदराबाद के वनसथलीपुरम थाने में दर्ज हुई है।
एक व्यक्ति ने अपनी पालतू बिल्ली के गायब होने की रिपोर्ट दर्ज कराने के लिए थाने का दरवाजा खटखटाया है। उसने अपनी बिल्ली को सकुशल ले आकर देने के लिए पुलिस से शिकायत में आग्रह किया है। डिटेल में जाएं तो वनस्थलीपुरम में रहने वाले महमूद एक बिल्ली पाल रहे हैं। बीती रात से लापता है। इससे परेशान होकर उसने तुरंत पुलिस से संपर्क किया। उन्होंने इसकी खासियत बताते हुए बिल्ली को ढूंढ़ने की अपील की।
उन्होंने कहा कि लापता बिल्ली दुर्लभ खो मणि (Khow Manee) नस्ल की है। बिल्ली की एक आँख हरे रंग की और दूसरी आँख नीले रंग की है। उन्होंने बताया कि यही उस बिल्ली की खासियत है। बिल्ली की उम्र 18 महीने की है। उसने बताया कि इसे 50 हजार में खरीदा था।
महमूद की तहरीर के मुताबिक पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। उसके घर के पास लगे सीसीटीवी कैमरों की जांच करने पर पता चला कि शनिवार की रात एक व्यक्ति बाइक पर आया और बिल्ली को उठा ले गया। पुलिस ने बाइक के नंबर के आधार पर उसकी शिनाख्त करने के काम में जुट गये हैं।
వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో విచిత్రమైన ఫిర్యాదు
హైదరాబాద్: పోలీస్ స్టేషన్లకు అప్పుడప్పుడు అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. కొన్ని ఫిర్యాదులు కూడా విచిత్రంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో అలాంటి విచిత్రమైన ఫిర్యాదు ఒకటి నమోదైంది.
తన పెంపుడు పిల్లి పోయిందని దాని యజమాని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. తన పిల్లిని క్షేమంగా తీసుకురావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే వనస్థలిపురంలో నివాసముండే మహమూద్ ఓ పిల్లిని పెంచుకుంటున్నాడు. గత రాత్రి నుంచి అది కనిపించకుండా పోయింది. దీంతో కలవరపాటుకు గురైన అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దాని ప్రత్యేకతలను వివరించి పిల్లిని కనిపెట్టాలని విజ్ఞప్తి చేశాడు.
కనిపించకుండా పోయిన పిల్లి అరుదైన హౌ మనీ (Khow Manee) జాతికి చెందినగా చెప్పాడు. పిల్లికి ఒక కన్ను గ్రీన్ కలర్‌లో, మరో కన్ను బ్లూ కలర్‌లో ఉంటుందన్నాడు. అదే ఆ పిల్లి యెుక్క ప్రత్యేకత అని వివరించాడు. పిల్లి వయస్సు18 నెలల అని రూ. 50 వేల పెట్టి దాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పాడు. మహమూద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతని ఇంటికి సమీపంలోని సీసీ కెమరాలను పరిశీలించగా శనివారం రాత్రి ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి పిల్లిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా అతడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. (Agencies)