हैदराबाद: फिल्म इंडस्ट्री में अब कई कलाकार कास्टिंग काउच पर अपना मुंह खोल रहे हैं। कई लोग आगे आकर खुलासा कर रहे हैं कि अगर उन्हें फिल्मों में मौका चाहिए तो उन्हें कमिटमेंट देने के लिए कहा गया है। लेकिन ये कास्टिंग काउच अभी नहीं बल्कि पुराने जमाने में भी था। इस बात का खुलासा सीनियर एक्ट्रेस कुट्टी पद्मिनी ने एक इंटरव्यू में किया है। उन्हें भी कमरे में एडजस्ट होने को कहा गया था।
तीन साल की उम्र में फिल्मों में एंट्री करने वाली कुट्टी पद्मिनी ने कई तमिल फिल्मों में चाइल्ड आर्टिस्ट के तौर पर काम किया। उन्होंने एमजीआर, शिवाजी गणेशन, जयशंकर जैसी कई फिल्मों में अभिनय किया। वह राष्ट्रीय सर्वश्रेष्ठ बाल अभिनेत्री का पुरस्कार जीतने वाली तमिलनाडु की पहली कलाकार भी हैं। उन्होंने कहा कि बाल अभिनेत्री होने के बाद नायिका के रूप में अपना कॅरियर शुरू करने के दौरान उन्हें निर्देशकों द्वारा परेशान किया गया था।
पद्मिनी ने यह भी बताया कि शोभन बाबू के साथ ज्यादा एक्टिंग करने के कारण उनसे करीबी बड़ी थी। उन्होंने कहा कि बचपन से फिल्मों में आने के कारण वह पढ़ाई नहीं कर पाईं। लेकिन शोभन बाबू ने बताया कि अगर तुम नहीं पढ़ते तो भी ऊपर कैसे आना है। उसने कहा कि लड़कियों को कैसे विकसित किया जाए, इस बारे में उनकी सलाह से वह बेहतर स्तर तक पहुंच पाई है। वर्तमान में 140 लोगों को वेतन देने के स्तर पर पहुंच गई हूं। “जिस किसी ने भी मुझे कमरे में एडजस्ट होने की बात कही थी, आज मैं उसकी मदद कर रही हूँ।” उसने कहा कि इतना करने पर बहुत संतोष मिलता है।
इस इंटरव्यू में उन्होंने अपने पति से अलग होने की वजह का भी खुलासा किया। उसने खुलासा किया कि उसके पति ने शादी के 22 साल बाद अपनी सेक्रेटरी से प्यार किया। अगर आप शादी करके और बच्चों को जन्म देकर ऐसा करेंगे तो आपको गुस्सा आएगा। इसलिए उनका कहना है कि वह एडजस्ट नहीं कर पाई। इसीलिए अकेली रहती हूं।
అప్పట్లోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందని బయటపెట్టిన సీనియర్ నటి
హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడు చాలామంది నటులు నోరువిప్పుతున్నారు. సినిమాల్లో అవకాశాలు కావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాలని పలువురు అడిగారంటూ బయటపెడుతున్నారు. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు పాత కాలంలోనూ ఉండేదట. ఈ విషయాన్ని సీనియర్ నటి కుట్టి పద్మిణి బయటపెట్టింది. తమతో రూంలో అడ్జస్ట్ అవ్వాలని అడిగారని పేర్కొంది.
మూడేళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని తమిళంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జైశంకర్ వంటి చాలామంది సినిమాల్లో నటించింది. తమిళనాడు నుంచి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా ఈమెనే. బాలనటి తర్వాత హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టే సమయంలో తనకు దర్శకుల నుంచి వేధింపులు వచ్చాయని తెలిపింది.
శోభన్‌బాబుతో ఎక్కువగా నటించడంతో అతనితో చనువు ఏర్పడిందని గుర్తుచేసుకుంది. చిన్నతనం నుంచి సినిమాల్లోనే ఉండటంతో చదువుకోవడం వీలుకాలేదని చెప్పింది. కానీ చదువుకోకపోయినా పైకి ఎలా రావాలో శోభన్ బాబు చెప్పారని తెలిపింది. ఆడపిల్లలు ఎలా డెవలప్ అవ్వాలో ఆయన ఇచ్చిన సలహాలతో మంచి స్థాయికి ఎదిగానని చెప్పింది. ప్రస్తుతం 140 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. “ఎవరైతే నన్ను రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలని పిలిచారో వాళ్లకే సాయం చేస్తున్నా.” అని తెలిపింది. ఇది చాలా సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంది.
ఇక తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన భర్త పెళ్లయిన 22 ఏళ్లకు తన సెక్రటరీని లవ్ చేశాడని బయటపెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత అలా చేస్తే కోపం వస్తుంది కదా.. అలాంటి టైమ్‌లో అడ్జస్ట్ అయినా అవ్వాలి.. లేదా ఒంటరిగా అయినా ఉండాలని తెలిపింది. అందుకే తాను అడ్జస్ట్ అవ్వలేక ఒంటరిగా ఉంటున్నా అని చెప్పింది. (ఏజెన్సీలు)