हैदराबाद: जगित्याल में दो बस स्टैंडों में सोमवार को लोगों की काफी भीड़ थी। जगित्याल में मकान भूखंड को लेकर सीपीएम पार्टी के नेतृत्व में विरोध प्रदर्शन कार्यक्रम चलाया गया। इस विरोध कार्यक्रम में विभिन्न हिस्सों से बड़ी संख्या में महिलाएं शामिल हुईं। आंदोलन कार्यक्रम समाप्त होते ही शाम को घर जाते समय जगित्याल बस स्टैंड पर अचानक भीड़ बढ़ गयी।
ठीक उसी समय कॉलेज का समय समाप्त होने के कारण छात्र भी बस स्टैंड पर पहुंच गए। हालाँकि, वहाँ बहुत सारे लोग जमा हो गये। बस पहले से ही पूरी तरह से भरी चुकी थी। बहुत भीड़ थी। इसलिए छात्रों को फ़ुटबोर्ड पर खड़े होकर यात्रा करते पाये गये। यह सफर काफी खतरनाक था। कुछ छात्र बस की खिड़कियों के साथ-साथ बस के पीछे की सीढ़ी पर लटके पाये।
वहीं, एक गांव जाने के लिए बस में जगह न होने पर एक कॉलेज छात्रा ने सरकार और आरटीसी पर अपना गुस्सा जाहिर किया। उसने कहा कि अब वह घर कैसे जाएगी। उनके गांव जाने वाली बस भी चली गई है।
కిక్కిరిసిన బస్సులు, మహాలక్ష్మితో విద్యార్థుల ఇక్కట్లు
హైదరాబాద్: సోమవారం జగిత్యాల లోని రెండు బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాలలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆందోళన కార్యక్రమం ముగిసిన వెంటనే సాయంత్రం ఇంటికి వెళ్లే క్రమంలో జగిత్యాల బస్టాండ్ లో రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
సరిగ్గా అదే సమయానికి కళాశాలలు టైమ్ కూడా అయిపోవడంతో విద్యార్థులు బస్టాండ్ కు చేరుకున్నారు. అయితే అప్పటికే ఫుల్ లోడ్ తో ఉన్న బస్సులో ఇసుక వేస్తే రాలనంత జనం ఉండడంతో ప్రమాదకరస్థాయిలో విద్యార్థులు ఫుట్ బోర్డు పై నిలబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు విద్యార్థులు అయితే ఏకంగా కిటికీలతో పాటు బస్సు వెనకాల ల్యాడర్ పట్టుకుని వేలాడుతూ వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది.
ఇదే సమయంలో ఓ గ్రామానికి వెళ్లాల్సిన బస్సులో ఖాళీ లేకపోవడంతో ఓ కళాశాల విద్యార్థిని ప్రభుత్వంతో పాటు ఆర్టీసీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ గ్రామానికి వెళ్లాల్సిన ఉన్న ఒక్క బస్సు కూడా వెళ్లిపోయిందని ఇప్పుడు తను ఏ విధంగా ఇంటికి వెళ్లాలని బోరున విలపించింది.
ఆర్టీసీకి భారీగా ఆదాయం
తాజాగా, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఆదాయం భారీగా పెరిగినట్లు సమాచారం. నిత్యం 13 లక్షల మేర ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. ఇందులో 90% శాతం మహిళలే కావడం గమనార్హం. అయితే దీని వల్ల ఆర్టీసికి నష్టం జరుగుతుందని జనాలు భావించారు. ఈ పథకంతో ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేయనుందట. గతంలో 13 నుంచి 14 లక్షల ఆదాయం రాగా ఇప్పుడది 18-25 లక్షలకు పెరిగిందని సమాచారం. ఈ పథకం మొదలయ్యాక రోజులో 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. ఆర్టీసీ జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు పంపితే.. వారు దాని ఆధారంగా రీయింబర్స్ పే చేస్తుందట. (ఏజెన్సీలు)