हैदराबाद: तेलंगाना विधानसभा चुनाव का महापर्व शुरू हो चुका है। इसके साथ ही राजनीतिक दलों ने तेलंगाना की जनता को प्रभावित करने के लिए आकर्षक योजनाओं के साथ अपना मुख्य हथियार घोषणापत्र तैयार किया है। चुनाव कार्यक्रम जारी होने के बाद एक के बाद एक पार्टियां अपना घोषणा पत्र जारी कर रही हैं।
इस बार कांग्रेस पार्टी ने बाकी सभी पार्टियों से पहले छह गारंटी के नाम से अपना घोषणा पत्र जारी किया, जबकि बीआरएस पार्टी ने उससे भी ज्यादा आकर्षक घोषणा पत्र जारी किया। और अब इस चुनाव में कुलीनतंत्र का राज खत्म कर बहुजन समाज की स्थापना करने का संकल्प लेने वाली बसपा ने भी अपना घोषणा पत्र घोषित कर दिया है। पूर्व आईएएस आर एस प्रवीण कुमार के नेतृत्व वाली बसपा ने राज्य चुनाव के लिए 20 उम्मीदवारों की पहली सूची पहले ही जारी कर दी है।
इसी क्रम में बहुजन समाज की स्थापना का लक्ष्य लेकर मैदान में उतर रही बसपा ने अपने घोषणापत्र में दस योजनाओं का ऐलान किया है। हालांकि बीएसपी ने इस घोषणापत्र में दिलचस्प वादे किये हैं। जहां सभी पार्टियां अपने घोषणापत्रों में महिलाओं को भरपूर जगह दी हैं, वहीं बसपा ने भी महिलाओं के लिए एक आकर्षक योजना की घोषणा की है। महालक्ष्मी के साथ कांग्रेस और सौभाग्य लक्ष्मी के साथ बीआरएस सम्मान राशि देकर पल्ला झाड़ने की कोशिश की है। बीएसपी ने चाकली आइलम्मा महिला ज्योति नाम से एक योजना लेकर आई है। इस योजना के तहत महिला श्रमिकों और किसानों को मुफ्त वॉशिंग मशीन, स्मार्ट फोन और ड्राइविंग प्रशिक्षण प्रदान किया जाएगा। आंगनवाड़ी और आशा कार्यकर्ताओं को नियमित करने के साथ ही महिला संघों को सालाना एक लाख का ऋण देने की घोषणा की है।
यह भी पढ़ें:
इस बीच, कांशी युवा सरकार नाम से पांच साल में 10 लाख नौकरियां भर्ती की जाएंगी, जिनमें से 5 लाख महिलाओं को दी जाएंगी। मंत्रिमंडल में छात्र नेताओं को मौका दिया जाएगा। ज्योतिबा पूले विद्या दिवेना नाम से हर मंडल में एक इंटरनेशनल स्कूल, प्रत्येक मंडल से 100 लोगों को विदेशी शिक्षा, एआई के साथ कोडिंग में प्रशिक्षित भी दिया जाएगा। बहुजन रैथु बीमा के नाम पर प्रत्येक फसल के लिए न्यूनतम समर्थन मूल्य, बीज से बिक्री तक किसान को सटीक सरकारी सब्सिडी और धरणी पोर्टल को खत्म करने का वादा किया।
बसपा ने दोड्डी कोमुराया भूमि अधिकार के नाम पर हर भूमिहीन गरीब परिवार को एक एकड़ जमीन देने का वादा किया है। ब्लू जॉब कार्ड के नाम पर 350 रुपये मजदूरी के साथ साल में 150 दिन रोजगार की गारंटी दी गई है। सौ साल के स्वास्थ्य बीमा के नाम पर हर परिवार को 15 लाख रुपये का स्वास्थ्य बीमा दिया जाएगा। इसके अलावा, स्वास्थ्य बजट सालाना 25 हजार करोड़ रुपये निर्धारित की गई है।
यह भी पढ़ें:
बीएसपी ने कहा कि खाड़ी श्रमिकों के लिए प्रवासी श्रमिक कल्याण कोष के नाम से 5 हजार करोड़ के फंड से एक कल्याण बोर्ड स्थापित किया जाएगा। उन्होंने भीम रक्षा केंद्रों के नाम से बुजुर्गों को छात्रावास, भोजन और मुफ्त चिकित्सा देखभाल प्रदान करने का वादा किया। बसपा ने अपने घोषणापत्र में बेघरों को शेख बंदगी गृह बरोसा के नाम से 550 वर्ग गज मकान की जमीन, मकान बनाने वालों को 6 लाख रुपये और मकान पुनर्निर्माण के लिए 1.5 लाख रुपये देने का वादा किया है।
పది పథకాలతో బీఎస్పీ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పండుగ షురూ అయ్యింది. దీంతో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు తమ ప్రధాన అస్త్రమైన మేనిఫెస్టోలను ఆకర్షణీయమైన పథకాలతో సిద్ధం చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేఫథ్యంలో ఒకదాని తర్వాత ఒక పార్టీ తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి.
కాగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే ఆరు గ్యారెంటీల పేరుతో తమ మేనిఫెస్టో విడుదల చేయగా బీఆర్ఎస్ పార్టీ దాని కంటే ఇంకొంచెం ఆకర్షణీయంగా తయారు చేసిన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో దొర పాలనను అంతమొందించి బహుజన సమాజాన్ని స్థాపిస్తామంటూ నడుం బింగించిన బీఎస్పీ కూడా తన మేనిఫెస్టోను ప్రకటించింది. మాజీ ఐఏఎస్ ఆర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన బీఎస్పీ ఇప్పటికే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది బీఎస్పీ.
అయితే బహుజన సమాజం స్థాపించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీఎస్పీ పది పథకాలతో తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే ఈ మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు ఇచ్చింది బీఎస్పీ. అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లో మహిళలకు పెద్దపీట వేస్తుండగా బీఎస్పీ కూడా వనితలకు ఆకర్షణీయ పథకాన్ని ప్రకటించింది. మహాలక్ష్మితో కాంగ్రెస్, సౌభాగ్య లక్ష్మితో బీఆర్ఎస్ గౌరవ వేతనాలిచ్చి చేతులు దులుపునేందుకు ప్రయత్నిస్తే బీఎస్పీ మాత్రం చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా వాషింగ్ మిషన్లు, స్మార్లు ఫోన్లతో పాటు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపింది. అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగుల క్రమబద్దీకరణతో పాటు మహిళా సంఘాలకు ఏటా లక్ష రుణం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఇదిలా ఉంటే కాన్షీ యువ సర్కార్ పేరుతో ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, ఇందులో 5 లక్షలు మహిళలకే ఇవ్వనున్నట్టు పేర్కొంది. షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులకు ఛాన్స్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. పూలే విద్యా దివేన పేరుతో మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలం నుంచి 100 మందికి విదేశీ విద్ర, ఏఐతో పాటు కోడింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. బహుజన రైతు ధీమా పేరుతో ప్రతి పంటకు కనీస మద్దతు ధర, రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీతో పాటు ధరణి పోర్టల్‌ను కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది బీఎస్పీ.
దొడ్డి కొమురయ్య భూమి హక్కు పేరుతో భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమిని ఇవ్వనున్నట్టు హామీ ఇచ్చింది బీఎస్పీ. బ్లూ జాబ్ కార్డు పేరుతో ఏడాదిలో 150 రోజుల పాటు 350 రూపాయల కూలీతో ఉపాధి హామీ కల్పించనున్నట్టు పేర్కొంది. నూరేళ్ల ఆరోగ్య ధీమా పేరుతో ప్రతీ కుటుంబానికి 15 లక్షల ఆరోగ్య భీమా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఏటా 25 వేల కోట్లతో ఆరోగ్య బడ్జెట్ పెట్టనున్నట్టు వివరించింది.
వలస కార్మికలు సంక్షేమ నిధి పేరుతో 5 వేల కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భీం రక్షా కేంద్రాలు పేర్లతో వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం అందించనున్నట్టు హామీ ఇచ్చారు. షేక్ బందగీ గృహ బరోసా పేరుతో ఇళ్లులేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షల సాయం, ఇంటి పునర్నిర్మాణానికి ఒకటిన్నర లక్ష సాయం అందిచనున్నట్టు బీఎస్పీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. (ఏజెన్సీలు)