సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా… కచ్చితంగా పింక్ బుక్కు మైంటైన్ చేస్తాం
పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం
SLBC సహాయక చర్యలను వదిలేసి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు మంత్రులు వెళ్లడం సిగ్గుచేటు
కార్మికుల ప్రాణాలంటే కాంగ్రెస్ కు లెక్క లేదా ?
బీసీ రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులను పెట్టాలి
కుల సర్వే నివేదికను బహీర్గతం చేయలి
నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించే వారు ఎంత పెద్ద నాయకులైనా, అధికారులైనా వదిలిపెట్టేలేదే లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. “సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా… కచ్చితంగా పింక్ బుక్కు మైంటైన్ చేస్తాం. పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం. మాకూ టైమ్ వస్తుంది… అప్పుడు అందరి సంగతి చెప్తాం” అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
తెలంగాణ జాగృతి అధ్వర్యంలో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి శనివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత సింగోటంలోని శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దేవాలయాన్ని సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని, చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నార మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదని, కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. “మా మీటింగు కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై మంత్రి జూపల్లి దాడి చేయించారు. ఇదేమి రాజ్యం ? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు ? బీఆర్ఎస్ పార్టీని చూస్తేనే కాంగ్రెస్ నాయకులకు భయం పుడుతోంది” అని వ్యాఖ్యానించారు. కొల్లాపూర్ నియోజక వర్గానికి జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆయన నియోజకవర్గానికి వస్తున్నారని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బోగస్ చేసిందని, రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదని ఎండగట్టారు.
Also Read-
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ… కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్ దని, పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కేసీఆర్ హాయంలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నార్లాపూర్ వద్ద పంప్ హౌజ్ ను కూడా ప్రారంభించిందని, ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా నీళ్లు ఇవ్వాలనుకుంటే 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని ఎండగట్టారు.
కొడంగల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని, ఈ ప్రాజెక్టుకు బీమా నుంచి కాకుండా జూరాల నుంచి నీటిని తీసుకుంటే మంచిదని ఇంజనీర్లు చెబుతున్నారని, ప్రభుత్వం ఈ సూచనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
కేసీఆర్ ఉన్నప్పుడు సక్రమంగా, సకాలంలో రైతులకు యూరియా లభించేదని, కానీ ఇప్పుడు ఎందుకు రైతులకు యూరియా అందుబాటులో లేదు ? అని ప్రశ్నించారు. కేంద్రంతో కొట్లాడి కేసీఆర్ రాష్ట్రానికి ఎంత మేర యూరియా అవసరం అవుతుందో ముందె తెప్పించేవారని, ఇప్పుడు ప్రభుత్వం ఏదీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 11.5 కిమీ తవినప్పుడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదని, కేవలం ప్రభుత్వ నిర్లక్షం కారణంగా ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నదాన్ని బట్టి అర్థమవుతోందన్నారు. మట్టి, రాళ్లు పడుతున్నాయని కార్మికులు చెబుతున్నా ఏం కాదని చెప్పి పని చేయించారని అన్నారు. 8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ దూత వచ్చారని మంత్రులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఒక్క మంత్రి కూడా సంఘటనా స్థలం వద్ద లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేనితనమో అర్థమవుతోందని చెప్పారు.
తక్షణమే మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు 2500, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని చేశారు. హాస్టళ్లలో కనీసం సరైన భోజనం పెట్టడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బిడ్డలు చనిపోవడం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫీజు రియింబర్స్ జరగక చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని, అంబేద్కర్ ఓవర్ సిస్ స్కాలర్ షిప్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. మెఘా కృష్ణా రెడ్డి వంటి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం …. ప్రజలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాళ్లవైపే చూస్తుంది… ప్రజల వైపు కాదని స్పష్టం చేశారు.
అలాగే, నాగర్ కర్నూల్ లో జరిగిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే పూర్తి నివేదికను బయటపెట్టాలని, గ్రామాల వారీగా కులాల వారీగా జనాభాను బహీర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులను పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఒకటే బిల్లు పెడితే మొదటికే మోసం వస్తుందని తొలి నుంచీ తాను వాదిస్తున్నానని,దాంతో మూడు బిల్లులను పెట్టాలని ప్రతిపాదించామని, మూడింటికి ఒకే బిల్లు పెడితే కోర్టుల్లో నిలవదని వివరించారు.
కాంగ్రెస్ చేపట్టిన కుల సర్వే తప్పుడు తడఖగా ఉందని ఎండగట్టారు. 2014 కేసీఆర్ జరిపిన సర్వేలో బీసీలు 52 శాతం ఉన్నట్లు తేలిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన సర్వేలో 46 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు లెక్కలతో బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపిస్తున్నదని విమర్శించారు.
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీ హక్కులకు రాజ్యాంగ రక్షణ రాకపోవడం బాధాకరమని, చట్టసభల్లో బీసీలు ఎంత మంది ఉన్నారో చూస్తే పరిస్థితి అర్థమవుతోందని తెలిపారు. బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో ఇండియా అమెరికాను దాటిపోయేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ రక్షణ కలగాలంటే బీసీల కులాల జనాభాను లెక్కబెట్టడం అవసరమని, దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులగణన జరగాలని ఆకాంక్షించారు.
BRS MLC Kalvakuntla Kavitha in Nagar Kurnool
While 8 people are losing their lives in the SLBC tunnel accident, Congress leaders went to a party meeting in Hyderabad.
Not a single minister is present at the accident site now, which shows that Congress leaders did not care about lives.
Under KCR’s leadership, when the SLBC tunnel was being constructed for 11.5 km, there was no accident.
It is evident from the workers’ statements that the accident happened due to government negligence.
