తెలంగాణ శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కోరిన బిఅర్ఎస్ ఎంఏల్యేలు

తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెలిపిన బిఅర్ఎస్

తెలంగాణ అప్పులపైన శాశన సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని కోరిన బిఅర్ఎస్

ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన అనంతరం మీడియాతో అసెంబ్లీ లాబీలో మాట్లాడిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్

అర్ బిఅర్ఐ నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్ఫష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నట్లు తెలిపిన బిఅర్ ఎస్

అప్పుల పై ఆర్ధిక మంత్రి గారి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ”హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించింది

2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది

ఆర్ధిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు.

కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం

శాసనసభ సాక్షిగా శాసనసభ్యులను, తెలంగాణ ప్రజలను ప్రభుత్వ రుణాలపైన తప్పు దోవ పట్టించారు. అందుకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం

దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంలోనూ సభ హక్కుల నోటీసు ఇచ్చాం

లగచర్ల వంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, టూరిజంపైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అడ్డం పడుతుంది

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లగచర్ల అంశంలో శాసనసభలో చర్చించాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేశాం

రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది

కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 3 లక్షల 89 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని తెలుపింది

రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అసలైన అప్పులతో సవరణ స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇవ్వాలి

లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని సభను ప్రవేశపెట్టాలి

గతంలో నేనే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ స్పీకర్ మనోహర్ అంగీకరించారు. ఆ సందర్భంగా సభలో చర్చ కూడా జరిగింది

గతంలో ఉన్న పద్ధతులు సాంప్రదాయాలకు అనుగుణంగా స్పీకర్ ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం

గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ శాసనసభలో అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను

ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపైన బయట కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు

7 లక్షల కోట్ల అప్పు అంటూ లేని అప్పు గురించి మాట్లాడుతున్నారు

వీళ్లు చెబుతున్న అప్పుల లెక్కలు తప్పు కాబట్టి ఈ ప్రభుత్వం కడుతున్నామని చెప్తున్న నెలకు 6వేల 500 కోట్ల వడ్డీ లెక్కలు కూడా తప్పే

రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నది కేవలం ఎడాదికి 22000 కోట్ల రూపాయల వడ్డీ మాత్రమే

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజం పైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ స్వీకరించడం బాధాకరం

రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి వందకు పైగా చేసిన పర్యటనలతో ఢిల్లీ టూరిజం బాగా పెరిగిందన్నారు. మరోవైపు 40 మంది లగచర్లరైతులను జైలులో పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మొదలుకొని పార్టీ నాయకులను జైల్లో పెడుతున్న జైలు టూరిజం… బెయిల్ వచ్చిన తర్వాత కూడా నటులను జైలులో ఉంచుతున్న జైలు టూరిజం… ప్రభుత్వ పథకాల పైన మాట్లాడుతుంటే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి చేస్తున్న జైలు టూరిజం.. ఈ విధంగా తెలంగాణలో జైలు టూరిజం బాగా నడుస్తుంది.

సర్పంచుల సమస్యలను కూడా శాసనసభలో లేవనెత్తినాం.. ఈ సందర్భంగా సర్పంచ్ ల సమస్యలను లేవనెత్తినందుకు వారు వచ్చి మా పార్టీని అభినందించారు. వారికి ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్ల రూపాయలు గత నెలలు ఇచ్చిన నిధుల్లో సగం ఇస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేసాము. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని స్పీకర్ కు కూడా విజ్ఞప్తి చేశాము.

శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్ ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. స్పీకర్ సొంత జిల్లా వికారాబాద్ లో జరిగిన ఈ సంఘటన పైన చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో కొంత సానుకూలంగా వ్యవరించాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రైతులను అక్రమంగా జైల్లో ఉంచిన తీరుపై రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని శాసనసభలో తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు

ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను, శాసనసభ వైపు రాకుండా చేసిన తీరుపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేలు వచ్చి అందరూ మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటున్నదని కేటీఆర్ అన్నారు. అయితే గతంలో ఇదే శాసనసభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాల వంటి వాటితో పాటు అనేక రకాల అంశాలను తీసుకువచ్చి నిరసన తెలిపిన అంశాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

Also Read-

ఈ ప్రభుత్వం శాసనసభలో మమ్మల్ని కట్టడి చేసి ప్రభుత్వ వైఫల్యాలను దాచుకోవాలని చూస్తుందని కేటీఆర్ అన్నారు. శాసనసభ్యులను మీడియా వద్ద మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్న తీరు పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు పలువురు శాసనసభ్యులు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి వెళ్తే కాసేపు ఆపాలని… రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వచ్చిన అంశం పైన మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వం తమ వైపల్యాలను దాచి పెట్టేందుకే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుందన్నారు.

రైతు కూలీలకు 12 వేల అర్ధిక సహాయం అందిస్తామంటూ భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహరాలకు వ్యతిరేఖం అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని బట్టి విక్రమార్క మర్చిపోయారన్నారు. ఈ అంశాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన భట్టి, శాశన సభ బయట ప్రకటన చేయడం పై కెటిఅర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఈ ప్రకటన చేస్తే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదని, అందుకే బయట ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామమని చెప్తున్న మాటను కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేవుళ్ళ పైన ఓట్లు వేసిన విషయానికే దిక్కు లేదని అలాంటిదిప్పుడు సంక్రాంతికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తామంటే రాష్ట్ర ప్రజలు ఎవరికి నమ్మకం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X