बड़ा आगाज : “27 अप्रैल को BRS स्थापना दिवस और अक्टूबर में महासभा”

हैदराबाद : भारतीय राष्ट्र समिति ने पार्टी के स्थापना दिवस कार्यक्रमों को व्यापक स्तर पर आयोजित करने का फैसला किया है। इसके तहत पार्टी इस महीने की 27 तारीख को तेलंगाना भवन में पार्टी स्थापना समारोह आयोजित करेगी। पार्टी के कार्यकारी अध्यक्ष कल्वकुंट्ला तारक रामाराव ने रविवार को इसकी घोषणा की। उन्होंने इस आशय का बयान जारी किया।

उन्होंने कहा कि राज्य भर में पहले से ही व्यापक रूप से आयोजित आत्मीय सम्मेलन कार्यक्रमों का पार्टी के कार्यर्ताओं से अच्छी प्रतिक्रिया मिल रही है। केटीआर ने कहा कि तेलंगाना भर में बड़े पैमाने पर धान की कटाई और बढ़ते हुए गर्मी को देखते हुए भारत राष्ट्र समिति का महासभा बड़े पैमाने पर 10 अक्टूबर को वरंगल में किया जाएगा।

“27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం, అక్టోబర్‌లో వరంగల్‌లో మహాసభ”

హైదరాబాద్ : పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందన్న ఆయన. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నిర్వహించుకునే కార్యక్రమాల వివరాలను తెలిపారు.

ఈ నెల 25న తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు పార్టీ నియమించిన ఇన్‌చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతాని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ముగించుకొని, ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని శ్రేణులకు సూచించారు. 25న రోజంతా పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ నిర్వహణ జరుగుతుందన్నారు.

ఆయా సమావేశాల్లో పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిని విస్తృతంగా చర్చించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

ప్రతి పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభ కనీసం 2500 -3000 మందితో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరిధిలోని గ్రామ, వార్డ్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీల డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, పురపాలికల కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, పురపాలక సంఘాల చైర్ పర్సన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు.

వీరందరినీ సమావేశాలకు హాజరయ్యేలా సమన్వయం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు కేటీఆర్‌ తెలిపారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు కేటీఆర్‌ సూచించారు.

ఈ నెల 27న హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 27న తెలంగాణ భవన్లో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

ఆ రోజు ఉదయం కేసీఆర్‌ పార్టీ జెండాను ఎగుర వేసి, సమావేశాన్ని ప్రారంభిస్తారన్నారు. సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విస్తృతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాధారణంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ సభ, విస్తృత స్థాయి సమావేశం బదులు అక్టోబర్ 10న భారత రాష్ట్ర సమితి వరంగల్ మహాసభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించుకుంటున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలను మరింత విస్తృతంగా, కూలంకషంగా మే నెలాఖరు దాకా కుటుంబ వాతావరణంలో కొనసాగించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్‌కు నంద కిశ్‌ర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంపీ మాలోతు కవిత నియమించారు. ముగ్గురురు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారని కేటీఆర్‌ వివరించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X