STUDY SHOULD BE DONE ON THE ISSUES OF TRIBALS AND FIND SOLUTIONS: Prof R Lambadri

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU), Faculty of Social Sciences, Department of Political Science in collaboration with Telangana State Council for Higher Education (TSCHE) concluded a Two Day International Conference on “Tribal Livelihood Patterns : Issues and Strategies for Empowerment” at the University Campus on August 9, 2024.

Prof. R. Limbadri, Chairman, Telangana State Council for Higher Education was the chief guest for the valedictory program. Prof. Limbadri said that the international conference organized by Ambedkar Open University for studying the problems of tribals and finding solutions was a key development. The organizers were advised to compile the many points revealed by the speakers in the conference held for two days and prepare it as a report. He suggested that the problems in the tribal area are increasing day by day and research should be done in the Universities to solve those problems. The researchers should also suggest solutions and expressed hope that the government would look into all these aspects and work towards improving the living standards of the tribal people.

Prof. G. Pushpa Chakrapani, Director (Academic) presided over the program. She explained this two-day international program was organized with the intention of having a comprehensive discussion on the most important tribal issues. It was revealed that researchers from various universities of the country attended and presented research papers.

Prof. E. Sudha Rani, Registrar I/c, BRAOU attended as Guests of Honour for the program and said that tribal and adivasi tribes are living in many states and different parts of the country and their life has become questionable in the name of industrialization, Deforestation has become a problem for both the environment and the livelihood of the tribals. She expressed concern that children and women in tribal areas are still suffering from malnutrition.

సంబంధిత వార్త

Prof. Vaddanam Srinivas, Dean, Faculty of Social Sciences observed who participated in this conference had studied the problems related to many adivasi and tribal communities and presented research papers, explaining that it was a good development to discuss the sub-castes of the respective races. He expressed the hope that the opinions and suggestions made in this conference will be useful for improving the living standards of the tribal people in the coming days.

Prof. Gunti Ravinder, Conference Director, presented a reported the details of the session wise program in the two day International conference. It has been revealed that many Social Science Teachers and researchers have submitted their research papers in this two-day conference and guide the research students, given many suggestions and advices to solve the problems of tribals and adivasis. All these will be compiled and reported to the government. Prof.G.Lakshmi, Conference Co-director proposed vote of thanks. All the Directors, Deans, Heads of the Branches, Research Scholars & Students are participated in the program.

ఆదివాసీల సమస్యలపై అధ్యయనం జరగాలి : ప్రొ. లింబాద్రి

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ముగిసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా “ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు : సాధికారత సాధనలో సమస్యలు మరియు వ్యూహాలు” అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది.

ఈ ముగింపు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. ఆర్. లింబాద్రి ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. అయన మాట్లాడుతూ ఆదివాసీల సమస్యల అధ్యయనం, పరిష్కార మార్గాల అన్వేషణ కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఒక కీలక పరిణామంగా ఆయన అభివర్ణించారు. ఈ రెండు రోజుల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్ లో వక్తలు వెల్లడించిన అనేక అంశాలను క్రోడీకరించి ఓ నివేదిక రూపొందించాలని నిర్వాహకులకు సూచించారు. ట్రైబల్ ప్రాంతంలో సమస్యలు రోజు రోజూ పెరుగుతున్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు. పరిశోధకులు పరిష్కార మార్గాలను సూచించాలని, ఈ అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలించి ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆమే మాట్లాడుతూ ఎంతో కీలకమైన ఆదివాసీల సమస్యల పైన సమగ్రమైన చర్చ జరగాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు రోజుల అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. దేశంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధకులు హాజరై పరిశోధనా పత్రాలను సమర్పించారని వెల్లడించారు.

కార్యక్రమంలో గౌరవ అతిధులుగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి మాట్లాడుతూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో ఆదివాసీ, గిరిజన తెగలు నివసిస్తున్నాయని, పారిశ్రామికీకరణ పేరుతో వాళ్ళ జీవనం ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను కొట్టివేయడం వల్ల అటు పర్యావరణానికి ఇటు ఆదివాసీల జీవనానికి ఇబ్బందిగా మారిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులు, మహిళలు పౌష్టికాహార లోపంతో ఇప్పటికీ బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో సామాజిక శాస్త్రాల విభాగ డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వక్తలు పలు ఆదివాసీ, గిరిజన వర్గాలకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసి పరిశోధనా పత్రాలను సమర్పించారని ఆయా జాతుల్లోని ఉప కులాలకు సంబంధించి చర్చించడం మంచి పరిణామంగా వివరించారు. రానున్న రోజుల్లో ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు ఈ సదస్సు లో వచ్చిన అభిప్రాయలు, సూచనలు ఉపయోగపడతాయనే ఆశాభావాన్ని వ్యక్త పర్చారు.

కార్యక్రమంలో సదస్సు డైరెక్టర్ ప్రొ. గుంటి రవీందర్ ఈ రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో చర్చించిన వివరాలను వెల్లడించారు. ఇందులో అధ్యాపకులు, పరిశోధకులు తమ తమ పరిశోధనా పత్రాలను సమర్పించారని, గిరిజనుల, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారని వీటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. సదస్సు కో-డైరెక్టర్ ప్రొ. జి. లక్ష్మీ రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలును వివరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అన్ని విభాగాల అధ్యాపకులు, పలు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X